సిరిసిల్ల టౌన్: తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో మల్లావఝల సదాశివుడు స్మారక పురస్కారాలు –2026కు ప్రముఖ కవి, రచయిత డా.సంగిశెట్టి శ్రీనివాస్, చమన్ సింగ్ లు ఎంపికయ్యారని జిల్లా కోఆర్డినేటర్ నడిమెట్ల శ్రీనివాస్ తెలిపారు. ఈ నెల 3న హైదారబాద్‌లోని భైరతాబాద్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య భవన్‌లో జరిగే కార్యక్రమంలో కేటీఆర్ చేతుల మీదుగా పురస్కారాలు అందజేయనున్నట్లు తెలిపారు. ఆదివారం సిరిసిల్లలో తెలంగాణ వికాస సమితి ప్రతినిధులు ఆహ్వాన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ బాబు, ఆంకారపు రవి, కామారపు శ్రీనివాస్,
మహేశ్ తదితరులు పాల్గొన్నారు.
సోలార్ కేబుల్ వైర్ల చోరీ
వీణవంక: మండలంలోని చల్లూరు గ్రామ శివారులో కలవేణ రాజనర్సుకు చెందిన సోలార్ పవర్ ప్లాంట్ లో గుర్తు తెలియని వ్యక్తులు కేబుల్ వైర్లను దొంగలించినట్లు బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఆవుల తిరుపతి తెలిపారు. పవర్ ప్లాంట్ నిర్మాణ పనులు జరుగుతుండగా రూ.90వేల విలువ చేసే కేబుల్ వైర్లను రెండు సార్లు ఎత్తుకెళ్లారని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆదివారం ఎస్సైతో పాటు సిబ్బంది క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిశీలించారు. నిందితులను పట్టుకుంటామని వివరించారు.
శతాధిక వృద్ధురాలు మృతి
కథలాపూర్(వేములవాడ): కథలాపూర్ మండలంలోని సిరికొండలో ముంజ ఎల్లవ్వ(102) అనే శతాధిక వృద్ధురాలు అనారోగ్యంతో ఆదివారం మృతిచెందిన ట్లు గ్రామస్తులు తెలిపా రు. ఎల్లవ్వకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉండగా... మనుమలు, మనుమరాళ్లు సుమారు 60 మంది వరకు ఉన్నట్లు బంధువులు పేర్కొన్నారు. ఎల్లవ్వ అందరితో కలిసి మెలిసి ఉంటూ అనాటి ముచ్చట్లు చెప్పేదని గ్రామస్తులు గుర్తు చేసుకుంటున్నారు.
ఆర్టీసీ బస్సు కింద పడి
వృద్ధురాలికి గాయాలు
జగిత్యాలక్రైం: జగిత్యాల రూరల్ మండలంలోని కల్లెడ గ్రామానికి చెందిన లింగవ్వ అనే వృద్ధురాలు ఆర్టీసీ బస్సు కింద గాయాలపాలైంది.లింగవ్వ ధర్మపురికి వెళ్లేందుకు కల్లెడ బస్టాండ్ వద్ద ఆర్టీసీ బస్సు ఎక్కుతుండగా బస్సు కదలడంతో ఆమె కింద పడిపోయింది. దీంతో ఆమె కాలుపై వెనుక టైరు ఎక్కడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను స్థానికులు జగిత్యాల ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు.


