కరీంనగర్‌సిటీ: భవిష్యత్ లక్ష్యంతో.. ఉన్నత చదువుల కోసం వచ్చిన విద్యార్థిని వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకోవడం శాతవాహన యూనివర్సిటీలో కలకలం రేపింది. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లోని ఫరూక్‌నగర్‌కు చెందిన డెక్కలి చంద్రకళ (30) యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌బీ ద్వితీయ సంవత్సరం చదువుతూ వసతి గృహంలో ఉంటోంది. ఇటీవల దసరా సెలవులకు ఇంటికి వెళ్లివచ్చిన చంద్రకళ రెండురోజులుగా కొంత ముభావంగా ఉంటోందని ఆమె స్నేహితులు తెలిపారు. రెండు రోజులుగా ఎక్కువగా ఫోన్‌లో మాట్లాడుతూ ఉంటున్న చంద్రకళ ఆదివారం మధ్యాహ్నం సుమారు 1.30 గంటల సమయంలో తన స్నేహితులు వచ్చి లంచ్‌కు పిలిచారు. తనకు తలనొప్పిగా ఉందని, విశ్రాంతి తీసుకుంటానని వారికి సూచించింది. మళ్లీ స్నేహితులు సుమారు 3.30 గంటల సమయంలో గదికి వచ్చి చూడగా లోపలి వైపు గడియపెట్టి ఉండడంతో పలుమార్లు పిలిచినా స్పందన రాలేదు. కిటికిలోంచి చూడగా ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించింది. సెక్యూరిటీ సహాయంతో తలుపులు తీసి వర్సిటీ అధికారులు, పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి చంద్రకళను కిందకు దింపి ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న కొత్తపల్లి సీఐ బిల్లా కోటేశ్వర్ మృతురాలి వివరాలు సేకరించి ఆమె తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు.
ఎంతో ఇష్టంతో ఎల్‌ఎల్‌బీకి..
షాద్‌నగర్‌కు చెందిన చంద్రకళ మూడేళ్ల కోర్సులో భాగంగా శాతవాహన వర్సిటీలో ఎల్‌ఎల్‌బీలో చేరారు. తన చిన్నతనంలో జరిగిన ఓ సంఘటన ఆధారంగా ఇష్టంతోనే ఎల్‌ఎల్‌బీలో చేరినట్లు సేహ్నితుల వద్ద ప్రస్తావించేదని సమాచారం. ఆమె 8 ఏళ్ల వయసులో ఉన్న సమయంలో ఇంటి సమీపంలో జరిగిన ఓ నేరానికి సంబంధించి పోలీసుల విచారణ చూసిన ఆమె ఎప్పటికై నా లాయర్‌గా పని చేయాలని నిర్ణయించుకున్నట్లు పలుమార్లు చెప్పేదని ఆమె స్నేహితులు తెలిపారు. కళాశాల క్రీడాపోటీల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొనేదని, తాజాగా హిమచల్‌ప్రదేశ్‌లోని ఎన్‌సీసీ క్యాంప్ ఎంపికకూ ప్రయత్నించినట్లు తెలిసింది.
పర్యవేక్షణ కరువు...
శాతవాహన యూనివర్సిటీలో మహిళా వసతిగృహంపై పర్యవేక్షణ కరవైందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. రెండుమూడు రోజులుగా ముభావంగా ఉంటున్న చంద్రకళను పర్యవేక్షణ అధికారులు గమనించకపోవడం గమనార్హం. కొందరు విద్యార్థినులు ఈ విషయాన్ని వసతిగృహం పర్యవేక్షణ అధికారులు దృష్టి తీసుకెళ్దామని అనుకున్నా.. ఎవరూ అందుబాటులో లేరని తెల్సింది.


