కరీంనగర్‌టౌన్: శ్రీచైతన్య ఇంటర్మీడియట్ విద్యాసంస్థల ఐఐటీ–నీట్ అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం కరీంనగర్లో నిర్వహించిన శ్రీచైతన్య స్కాలర్షిప్ టాలెంట్ టెస్ట్–2026కు 15,615 మంది విద్యార్థులు హాజరయ్యారు. విద్యాసంస్థల అధినేత ముద్దసాని రమేశ్‌రెడ్డి మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందుల కారణంగా నాణ్యమైన విద్యకు దూరమవుతున్న ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించడమే ఈ పరీక్ష లక్ష్యమని అన్నారు. ఎంపికై న వారికి 100 శాతం ఉచిత విద్యతో పాటు ప్రత్యేక రాయితీలు కల్పించనున్నట్లు వెల్లడించారు. పరీక్షలో మొదటి స్థానం సాధించిన వారికి ల్యాప్‌టాప్, 2 నుంచి 10వ స్థానాల్లో నిలిచిన వారికి ట్యాబ్‌లు అందిస్తామన్నారు. అలాగే పరీక్షకు హాజరైన వారందరికీ కూపన్లు అందజేసి నిర్వహించిన లక్కీ డ్రాలో విజేతలకు స్మార్ట్ టీవీ, సైకిల్, సెల్ఫోన్లు అందజేసి అభినందించారు. స్కాలర్షిప్ టాలెంట్ టెస్ట్ ఫలితాలను మూడు, నాలుగు రోజుల్లో ప్రకటించి విద్యార్థులకు తెలియజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో శ్రీచైతన్య కళాశాలల సెక్రటరీ సాయి చైతన్యరెడ్డి, డైరెక్టర్ కర్ర నరేందర్ రెడ్డి, జూనియర్ కళాశాలల డీన్ జగన్మోహన్ రెడ్డి, ప్రిన్సిపాల్స్, శ్రీనివాస్ అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.


