కరీంనగర్: ఓటమి భయంతో కాంగ్రెస్ రాజ్యాంగ పరిరక్షణ పేరిట రాజకీయ డ్రామాలకు తెరలేపుతోందని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి విమర్శించారు. ఎన్నికల సంఘం, ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్)పై కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు రాద్ధాంతమని పేర్కొన్నారు. ఈనెల 5న కరీంనగర్‌లో నిర్వహించనున్న మహా పాదయాత్ర సన్నాహక సమావేశం జిల్లా అధ్యక్షురాలు గుర్రాల నిర్మలారెడ్డి ఆధ్వర్యంలో నగరంలో శనివారం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన శిల్పారెడ్డి మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘంపై బురదజల్లుతూ రాజ్యాంగం ప్రమాదంలో ఉందంటూ కాంగ్రెస్ నిరాధార ప్రచారం చేస్తోందని ఆరోపించారు. నవంబర్ 1న ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో నిర్వహించనున్న నిరసన కార్యక్రమం రాజకీయ ఉనికి కోసమేనన్నారు. పోలీసులకు, లాఠీలకు భయపడవద్దంటూ రాహుల్‌గాంధీ కార్యకర్తలను రెచ్చగొట్టేలా మాట్లాడటం సరికాదన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం, మేయర్ కొలగాని శ్రీనివాస్, రాష్ట్ర అధికార ప్రతిని ధి, డిప్యూటీ మేయర్ వై.సునీల్‌రావు, మాజీ జెడ్పీ చైర్మన్ కనుమల్ల విజయ మాట్లాడుతూ ఓట్ల చోరీ, ఎస్‌ఐఆర్‌పై నిరాధార ఆరోపణలతో ఎన్నికల సంఘం ప్రతిష్టను దెబ్బతీసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ విధానాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టడంతో పాటు ప్రజాస్వా మ్య పరిరక్షణ లక్ష్యంగా కరీంనగర్‌లో మహా పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు నాయకులు తెలిపారు. ప్రజలు, యువత, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.


