● హుజూరాబాద్, జమ్మికుంట ఆస్పత్రుల్లో అదనపు కలెక్టర్ అశ్వినీ తానాజీ వాకడే
హుజూరాబాద్/జమ్మికుంట: ప్రభుత్వాస్పత్రిలో వైద్యసేవల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని అదనపు కలెక్టర్ అశ్వినీ తానాజీ వాకడే హెచ్చరించారు. శనివారం హుజూరాబాద్ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి, జమ్మికుంట ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వార్డులు, లేబర్‌రూం, మెడికల్ స్టోర్‌ను పరిశీలించారు. హుజూరాబాద్‌లో రోగులకు అందుతున్న వైద్యసేవలపై సూపరింటెండెంట్ రవీందర్‌ను అడిగి తెలుసుకున్నారు. లేబర్ రూమ్‌లో రిజిస్టర్ల నిర్వహణ, మెడికల్ స్టోర్‌లో రికార్డులు అసంపూర్తిగా ఉండటంపై అసహనం వ్యక్తం చేశారు. విధులకు హాజరైన వైద్యులు, సిబ్బంది వివరాలను అటెండెన్స్ రిజిస్టర్‌తో సరిపోల్చి పరిశీలించారు. ఆసుపత్రి ఎదుట ప్రైవేట్ అంబులెన్స్‌లు నిలపకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. మళ్లీ తనిఖీలకు వస్తానని, ఆస్పత్రి నిర్వహణ గాడిలో పడాలని ఆదేశించారు. అసిస్టెంట్ కలెక్టర్ హరిప్రసాద్, ఆర్డీవో జలకుమారి, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ కృష్ణప్రసాద్, డాక్టర్ హఖీయోద్దీన్ ఖాన్, డిప్యూటీ డీఎంహెచ్‌వో ప్రభుదాస్, మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని, తహసీల్దార్ జక్కని నరేందర్, కమిషనర్ బి.కిషన్ పాల్గొన్నారు.


