కరీంనగర్ క్రైం: పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని సీపీ గౌస్ ఆలం కొనియాడారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల ముగింపు సందర్భంగా శనివారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ చౌక్ నుంచి అమరవీరుల స్తూపం వరకు ర్యాలీ సాగింది. సీపీ, పీస్ అండ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు, పోలీసు సిబ్బంది కొవ్వొత్తులతో అమరవీరులకు నివాళి అర్పించారు. ఉమ్మడి జిల్లాలో ఇప్పటివరకు 47మంది పోలీసులు విధి నిర్వహణలో అమరులయ్యారని గుర్తుచేశారు. ఏసీపీలు వెంకటస్వామి, యాదగిరిస్వామి, విజయ్‌కుమార్ పాల్గొన్నారు.


