పక్కాగా విద్యార్థుల వివరాలు | - | Sakshi
Sakshi News home page

పక్కాగా విద్యార్థుల వివరాలు

Oct 31 2026 12:19 AM | Updated on Oct 31 2026 12:19 AM

గంభీరావుపేట: ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల వివరాలను విద్యాశాఖ అధికారులు యూడైస్‌ ప్లస్‌లో(ఆన్‌లైన్‌)లో విద్యా సంవత్సరం ప్రారంభంలో నమోదు చేశారు. విద్యార్థుల వివరాలలో తప్పులు దొర్లినట్లు విద్యాశాఖ అధికారులు గుర్తించారు. వాటిని సరిచేయడానికి చివరి అవకాశం కల్పించారు. శనివారం నాటికి యూడైస్‌ ప్లస్‌లో వివరాలను సరిచేయాలని విద్యాశాఖ ఆదేశించింది. రాజన్నసిరిసిల్ల జిల్లాలో 315 ప్రాథమిక, 38 ప్రాథమికోన్నత, 111 ఉన్నత, 7 ఆదర్శ, 30 రెసిడెన్షియల్‌ పాఠశాలలు ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో సుమారు 48వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అలాగే 127 ప్రైవేటు పాఠశాలలు ఉండగా.. 30వేల మంది విద్యార్థులు చదువుతున్నారు.

నమోదు చేసేటప్పుడు

యూడైస్‌ ప్లస్‌లో విద్యార్థులకు సంబంధించిన వివరాలను నమోదు చేసేటప్పుడు అక్షర దోషాలు, సమాచారంలో తేడాలు, తరగతులు ఇతర వివరాల్లో పొరపాట్లు జరిగే అవకాశం ఉంటుంది. అలాగే పాఠశాల వివరాల్లోనూ తప్పులు ఉంటే వాటిని గుర్తించి సరిచేయాల్సి ఉంది. ఇందుకోసం సంబంధిత రికార్డులను పరిశీలించి ఆన్‌లైన్‌లో నమోదైన సమాచారాన్ని ధ్రువీకరించుకోవాల్సి ఉంది. ఆధార్‌కార్డులో ఉన్నట్లుగా ఇంటి పేరు రిజిస్టర్‌లో లేకుండా మరోలా ఉండడం, విద్యార్థి తల్లిదండ్రుల పేరు, పుట్టిన తేదీ తప్పుగా ఉండడం జరుగుతుంది. ప్రధానంగా పై తరగతులకు వెళ్లేటప్పుడు, పదో తరగతి, ఇంటర్‌ ఇతర పోటీపరీక్షల ఆన్‌లైన్‌లో నమోదు చేసే సమయంలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీటిని గుర్తించి తప్పుల సవరణకు ఉన్నతాధికారులు అవకాశం కల్పించారు.

ప్రణాళికల రూపకల్పనకు కీలకం

విద్యార్థుల భవిష్యత్‌కు సంబంధించి ప్రణాళికల రూపకల్పన చేయాలంటే పాఠశాలల్లో వారి వివరాలు సమగ్రంగా ఉండాలి. ఎంత మంది విద్యార్థులు చదువుతున్నారు.. ఏయే తరగతుల్లో చదువుతున్నారు.. పాఠశాలల్లో ఏయే సదుపాయాలు ఉన్నాయి.. అనే అంశాలపై స్పష్టమైన సమాచారం ఉంటేనే విద్యావ్యవస్థను బలోపేతం చేసుకునేందుకు వీలుంటుంది.

తప్పుల సవరణకు నేడు చివరి అవకాశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement