మేడిపల్లి(భీమారం): ఆ విద్యార్థిని పరుగు పందెంలో ఎక్కడ పాల్గొన్నా.. మెడల్ ఆమె సొంతం కావా ల్సిందే. భీమారం మండలం గోవిందారం గ్రామానికి చెందిన బత్తుల రుచిత రాష్ట్రస్థాయిలో తొమ్మిదిసార్లు రాణించి జిల్లా పేరును నిలబెట్టింది. కాగా, ఆ విద్యార్థి కుటుంబాన్ని ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. చదువులు చదించలేమని, పరుగు పందేలపై ఆశలు వదిలేసుకోవాలని కుటుంబీకులు చెప్పడంతో కన్నీరు పెట్టుకుంటూ స్కూల్ హెచ్ఎం. వ్యాయామ ఉపాధ్యాయుడికి చెప్పుకుని బాధపడింది. గోవిందారం గ్రామానికి చెందిన బత్తుల రుచిత స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. 6వ తరగతి నుంచే పరుగుపందెంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని, ఇప్పటి వరకు తొమ్మదిసార్లు రాష్ట్ర స్థాయిలో 800 మీటర్లు, 600 మీటర్ల పోటీల్లో సత్తాచాటింది. కాగా, నేషనల్ లెవల్లో పోటీపడాలంటే ప్రత్యేక కోచింగ్ అవసరం. డబ్బు వెచ్చించి కోచింగ్ తీసుకునే స్థోమత లేకపోవడంతో రుచిత ఉపాధ్యాయులకు చెప్పుకుంటూ కన్నీరు పెట్టుకుంది. ఎవరైనా దాతలు ముందుకొచ్చి ప్రోత్సాహం అందిస్తే నేషనల్ లెవల్లో ఆడి, దేశం తరఫున ఒలింపిక్స్లో ఆడుతానంటుంది రుచిత.
ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న విద్యార్థిని
ప్రోత్సహిస్తే జాతీయస్థాయిలో రాణించే అవకాశం


