కొత్తపల్లి/కరీంనగర్ క్రైం: పిల్లలు మంచి, చెడులను గుర్తించి, చెడు ప్రవర్తనను ధైర్యంగా వ్యతి రేకించడంతో పాటు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి యశ్వంత్ సింగ్ సూచించారు. జాతీయ న్యాయ సేవా ధికార సంస్థ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న సురక్షిత్ బచ్‌పన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం చింతకుంటలోని సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాల, నగరంలోని ఆల్ఫోర్స్ టైనీటాట్స్, సప్తగిరికాలనీ, సుభాష్‌నగర్, దుర్శేడ్ ప్రభుత్వ పాఠశాలల్లో న్యాయ అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. యశ్వంత్ సింగ్, జూనియర్ సివిల్ జడ్జి చిరాగ్ మెహతా, నాలుగో అదనపు జూనియర్ సివిల్ జడ్జి బానోతు రాజేశ్వర్ విద్యార్థులకు పోక్సో చట్టం, బాలల హక్కులు, వ్యక్తిగత భద్రతపై అవగాహన కల్పించారు. ఎలాంటి న్యాయసాయం అవసరమైనా జిల్లా న్యాయసేవాధికార సంస్థను సంప్రదించవచ్చని పేర్కొన్నారు. అనంతరం చింతకుంటలోని ఎంఆర్‌బీ ఇటుక బట్టీని తనిఖీ చేశారు. గుర్తింపు పత్రాలు లేకుండా కార్మికులకు పని కల్పించిన యజమానులపై చర్యలు తీసుకోవాలని కార్మికశాఖ అధికారులను ఆదేశించారు.
బండి సంజయ్ సహకారంతో డంప్‌యార్డు ప్రక్షాళన
కరీంనగర్ కార్పొరేషన్: కేంద్ర హోంశాఖ సహా య మంత్రి బండి సంజయ్ సహకారంతో డంప్‌యార్డ్‌ను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేస్తున్నామని మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు. ఇప్పుడు డంప్‌యార్డ్‌పై పోరాటం చేస్తామని చెబుతున్న వాళ్లు ఇన్ని రోజులు ఏం చేశారని ప్రశ్నించారు. శుక్రవారం 41వ డివిజన్ కట్టరాంపూర్‌లో డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్‌రావుతో కలిసి సాధారణ నిధులు రూ.12 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణా లకు శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ డంప్‌యార్డ్ సమస్య శాశ్వత పరిష్కారానికి రూ.17 కోట్లు విడుదల చేసి తాము బ యోమైనింగ్ ప్రక్రియ చేపడుతున్నామని తెలి పారు. నగరంలో కొంతమందికి ఇంతకాలం డంప్‌యార్డు సమస్య, స్థానిక ప్రజల ఇబ్బందులు కనబడలేదని విమర్శించారు. తాము డంప్ యార్డు సమస్య పరిష్కారం దిశగా అడుగులు వేస్తుంటే ఓర్వలేక ఉనికి కోసం పాకులాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డంప్‌యార్డ్‌లో రెండు విధాలుగా పనులను ముమ్మరంగా చేసి పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేస్తామని అన్నారు. కార్పొరేటర్ నాంపల్లి కవిత, ఈఈ లచ్చిరెడ్డి, ఏఈ భీంవర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.
హెచ్‌ఆర్‌ఏ పెంచండి
కరీంనగర్ అర్బన్: ఎనిమిది కిలోమీటర్ల పరిధిలోని గ్రామాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ఏను తిరిగి 17శాతానికి పెంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా చైర్మన్, టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్‌రెడ్డి డిమాండ్ చేశారు. టీజీవోస్ జిల్లా అధ్యక్షుడు మడిపల్లి కాళీ చరణ్‌తో కలిసి శుక్రవారం కలెక్టర్ చిత్రామిశ్రాకు వినతిపత్రం ఇచ్చారు. నగరపాలక సంస్థకు 8 కిలోమీటర్ల పరిధిలోని గ్రామాల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ఏ విషయంలో జరుగుతున్న ఆర్థిక నష్టాన్ని నివారించాలని కోరారు. గత కలెక్టర్ 21 గ్రామాలకు హెచ్‌ఆర్‌ఏను 11నుంచి 17శాతానికి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారని పేర్కొన్నారు. ఈ మేరకు 26 సెప్టెంబర్ 2025న గెజిట్ కూడా ప్రకటించబడిందని, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక అనుమతి, రాటిఫికేషన్ లేదనే కారణంతో హెచ్‌ఆర్‌ఏను 11శాతానికి తగ్గించారని వివరించారు. గతంలో చేపట్టిన సర్వే, జారీ చేసిన ఉత్తర్వులు, గెజిట్ ప్రకటనను పరిగణనలోకి తీసుకొని, ఆయా గ్రామాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు తిరిగి 17శాతం హెచ్‌ఆర్‌ఏ అమలయ్యేలా రాష్ట్ర ప్రభుత్వానికి రాటిఫికేషన్ కోసం అవసరమైన ప్రతిపాదనలు పంపాలని విజ్ఞప్తి చేశారు.


