నల్లానీరు, ఇంటింటా బోర్లు ఉన్నా నగరంలో చేతింపులకు ఇంకా ప్రాధాన్యం తగ్గలేదు. ఒకవైపు ఎల్నినో కరువు.. మరోవైపు వేసవి లో ఎలా ఉంటుందో అనే భయం ఇప్పటి నుంచే మంచినీటిని ఒడిసిపట్టేలా చేస్తోంది. అన్ని రకాల ప్రత్యామ్నాయాల గురించి ఆలోచన చేస్తున్న పాలకవర్గం నగరంలో నిరుపయోగంగా ఉన్న చేతిపంపులపైనా దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. ఒక్కో డివిజన్లో పదుల సంఖ్యలో చేతిపంపులు మరమ్మతుకు గురికాగా.. బాగుచేస్తే దాహం తీర్చుతాయని సూచిస్తున్నారు. ఇప్పటికే భూగర్భ జలాలు అడుగంటిపోతుండగా, చేతిపంపులే దిక్కయ్యేనా అన్న విధంగా ముకరంపుర, జ్యోతినగర్లో ప్రజలే సొంతంగా మరమ్మతులు చేస్తున్నారు. బోరింగుల చుట్టూ చెత్తా చెదారం తొలగిస్తున్నారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, కరీంనగర్


