ధర్మారం: మండలంలోని పత్తిపాక గ్రామంలో యువశక్తి యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని వివిధ రాష్ట్రాల డీవైఏలు అన్నారు. గురువారం పత్తిపాక గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు సంఘం ద్వారా చేపట్టిన సేవా కార్యక్రమాలను అధికారులకు వివరించారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ, అసోసియేషన్ సేవలు ఆదర్శనీయమని, మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. కార్యక్రమంలో డీవైఏ గోలి తిరుపతిరెడ్డి, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, తమిళనాడు, ఒడిశా, కేరళం, జమ్మూకశ్మీర్ డీవైవోలు, విండో చైర్మన్ నోముల వెంకటరెడ్డి, అసోసియేషన్ ప్రతినిధులు మహేశ్, అధ్యక్షుడు జిల్లాల అనిల్, సెక్రటరీ అజాంత్ వేణు, నరేందర్, అకౌంటెంట్ కిరణ్, సర్పంచు మాందాల శ్రావణిహరీశ్ తదితరులు పాల్గొన్నారు.


