కొత్తపల్లి(కరీంనగర్ ): కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ–టెక్నో పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థి పి.శ్రీహాస్ అండర్–15 రాష్ట్రస్థాయి రోలర్ స్కేటింగ్ పోటీలకు ఎంపికై నట్లు ఆ విద్యా సంస్థల చైర్మన్ వి.నరేందర్ రెడ్డి తెలిపారు. ఇటీవల పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో నిర్వహించిన జోనల్ స్థాయి రోలర్ స్కేటింగ్ పోటీల్లో శ్రీహాస్ అద్భుత ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికవ్వడంతో బుధవారం కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ–టెక్నో పాఠశాలలో విద్యార్థిని అభినందించారు.
నిరుపేద విద్యార్థులకు ఉచిత కోచింగ్
కరీంనగర్‌కల్చరల్: ఆర్థిక ఇబ్బందులతో నిరుపేద విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాల అవకాశాలను కోల్పోకూడదనే ఉద్దేశంతో టీఆర్‌పీ సుమార్గ్ ద్వారా ఎస్సై, పోలీస్ కానిస్టేబుల్, ఎఫ్‌బీవో పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు టీఆర్‌పీ రాష్ట్ర కార్యదర్శి మొహమ్మద్ అఖిల్ పాషా తెలిపారు. కరీంనగర్‌లో బుధవారం పార్టీ నాయకులతో కలిసి శిక్షణ పొందుతున్న విద్యార్థులకు ఆయన ఐడీ కార్డులు పంపిణీ చేశారు. టీఆర్‌పీ అధినేత తీన్మార్ మల్లన్న ఆశయాలకు అనుగుణంగా ఉచిత విద్య, వైద్యం, సత్వర న్యాయం లక్ష్యంగా పనిచేస్తున్నట్లు పే ర్కొన్నారు. ఎస్‌ఆర్ ఐఏఎస్ అకాడమీ అకడమిక్ డైరెక్టర్ కరీం రాజు, టీఆర్‌పీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ చాంద్ పాషా, మహిళా అధ్యక్షురాలు రాచూరి అరుణదేవి, రాష్ట్ర యువజన విభాగ సహాయ కార్యదర్శి మహబూబ్ అలీ, జిల్లా మైనారిటీ అధ్యక్షుడు మొహమ్మద్ వాజిద్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్షత్ బిన్‌అలీ, జిల్లా ప్రధాన కార్యదర్శి చిగుర్ల మోహన్ పాల్గొన్నారు.
తాళం వేసిన ఇంట్లో చోరీ
జగిత్యాలక్రైం: జగిత్యాలలోని విద్యానగర్‌లో తాళం వేసిన ఇంట్లో బుధవారం మధ్యాహ్నం గుర్తుతెలియని వ్యక్తి చోరీకి పాల్పడ్డారు. విద్యానగర్‌కు చెందిన ఆర్ముల్ల పద్మ ఇంటికి తాళం వేసి బీడీలు ఇచ్చేందుకు వెళ్లింది. తిరిగి వచ్చేసరికి ఇంటి తాళాలు పగులగొట్టి ఉంది. ఇంట్లోకి వెళ్లి చూడగా నాలుగు తులాల బంగారు ఆభరణాలు కనిపించలేదు. దీంతో బాధితురాలు పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసినట్లు పట్టణ పోలీసులు తెలిపారు.
మోటార్ల చోరీ
శంకరపట్నం: మండలంలోని కరీంపేట గ్రామంలో 12రోజుల వ్యవధిలో ఓ రైతుకు చెందిన రెండు వ్యవసాయ మోటార్లు చోరీకి గురయ్యాయి. గ్రామానికి చెందిన వనపర్తి రాజేశం పొలం ఎండిపోతుండడంతో వేరే రైతు వద్దనుంచి మోటార్ తీసుకొచ్చి నీళ్లు పారిస్తున్నాడు. బుధవారం వేకువజామున వెళ్లి చూసేసరికి మోటార్ కనిపించలేదు. ఇటీవల సైతం రాజేశంకు చెందిన మోటార్ చోరీకి గురైంది. అదే విధంగా కేశవపట్నంలోని ఓ కేఫ్‌లో దొంగలు చోరీకి పాల్పడి రూ.35వేలు ఎళ్తుకెళ్లగా.. బాధితుల ఫిర్యాదుతో ఎస్సై శేఖర్‌రెడ్డి దర్యాప్తు చేస్తున్నారు.


