ప్రేమ పేరుతో యువతిపై దాడి | - | Sakshi
Sakshi News home page

ప్రేమ పేరుతో యువతిపై దాడి

Oct 29 2026 12:06 AM | Updated on Oct 29 2026 12:06 AM

● నిందితుడిపై ఎస్సీ, ఎస్టీ కేసు ● రిమాండ్‌కు తరలింపు ● వివరాలు వెల్లడించిన సిరిసిల్ల డీఎస్పీ కే.నాగేంద్రచారి

● నిందితుడిపై ఎస్సీ, ఎస్టీ కేసు ● రిమాండ్‌కు తరలింపు ● వివరాలు వెల్లడించిన సిరిసిల్ల డీఎస్పీ కే.నాగేంద్రచారి

ఎల్లారెడ్డిపేట: రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలానికి చెందిన ఓ యువతిని కొన్ని రోజులుగా ప్రేమ పేరుతో వెంటాడుతూ.. అసభ్యకరంగా ప్రవర్తించిన యువకుడిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. బీజేపీ నాయకులు సదరు యువకుడిని చితకబాది మంగళవారం రాత్రి పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు బుధవారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. సిరిసిల్ల డీఎస్పీ కె.నాగేంద్రచారి తెలిపిన వివరాలు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన జుబేర్‌ కొంతకాలంగా మహిళలను వెంటాడుతూ వేధిస్తున్నాడు. ఇటీవల ఓ గిరిజన యువతిని ప్రేమపేరుతో వేధిస్తూ వెంటాడుతున్నాడు. సదరు యువతిపై అనుచితంగా వ్యవహరిస్తుండగా.. వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ సంఘటనపై విచారణ చేసి జుబేర్‌ యువతిని వేధించినట్లు నిర్ధారణ కావడంతో గిరిజన యువతి ఫిర్యాదుతో ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. జుబేర్‌పై గతంలో హుజూరాబాద్‌లో పోక్సో కేసు నమోదుకాగా జైలుకు వెళ్లి వచ్చినట్లు తెలిపారు. అతని నేర ప్రవృత్తిని పరిగణనలోకి తీసుకొని రౌడీషీట్‌ ఓపెన్‌ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఉద్వేగాలకు లోన్‌ కాకుండా సమన్వయం పాటిస్తూ పోలీస్‌శాఖకు సహకరించాలని కోరారు. ఎవరూ చట్టాన్ని దాటి ప్రవర్తించరాదని హెచ్చరించారు. సీఐ ఓ.వెంకటేశ్‌, ఎస్సై రమేశ్‌గౌడ్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement