హుజూరాబాద్: పట్టణంలోని బతుకమ్మ సౌళ్లలో మారుతినగర్‌కు చెందిన ఇప్పలపల్లి శంకర్ వ్యవసాయ మోటారు చోరీకి గురైంది. చెక్‌డ్యాం సమీపంలో శంకర్‌కు వ్యవసాయ భూమి ఉంది. ఆదివారం ఉదయం పొలం వద్దకు వెళ్లగా మోటారు కనిపించకపోవడంతో చోరీకి గురైందని, దొంగిలించినవారిని గుర్తించాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మోటార్ విలువ సుమారు రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు ఉంటుందని బాధితుడు వాపోయాడు.
పెద్దమ్మ ఆలయంలో చోరీ
వెల్గటూర్: ఎండపల్లి మండలం రాజారాంపల్లిలోని పెద్దమ్మ ఆలయంలో ఆదివారం వేకువజామున చోరీ జరిగింది. ఆలయం తలుపులు పగులగొట్టిన దొంగలు అమ్మవారి ముక్కుపుడక, పుస్తెలతాడు, నగదును ఎత్తుకెళ్లారు. చోరీకి గురైన వాటి విలువ సుమారు రూ.50 వేల వరకు ఉంటుందని స్థానికులు తెలిపారు. గతంలోనూ ఇదే ఆలయంలో రెండుసార్లు దొంగతనం జరిగిందని పేర్కొన్నారు. పోలీసులు వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు.


