ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన ఇసుక ట్రాక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన ఇసుక ట్రాక్టర్‌

Oct 26 2026 12:04 AM | Updated on Oct 26 2026 12:04 AM

● తప్పిన పెను ప్రమాదం

● తప్పిన పెను ప్రమాదం

జమ్మికుంట: అజాగ్రత్తగా ఇసుక ట్రాక్టర్‌ను నడుపుతూ ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన ఘటనపై కేసు నమోదు చేశామని టౌన్‌ సీఐ రామకృష్ణ తెలిపారు. మండలంలోని కోరపల్లి వద్ద ఆదివారం ఉదయం ప్రమాదం జరిగింది. జమ్మికుంట నుంచి జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కుందనపల్లి గ్రామానికి వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఇసుక ట్రాక్టర్‌ డ్రైవర్‌ యూనిస్‌ సలీం ఢీకొట్టాడు. బస్సు ముందు భాగం ధ్వంసం కాగా ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది. బస్సు డ్రైవర్‌ ఈసంపెల్లి లోకేశ్‌ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ వివరించారు.

ఉక్రెయిన్‌ నుంచి స్వదేశానికి సుదర్శన్‌ మృతదేహం

జగిత్యాలరూరల్‌: జగిత్యా ల అర్బన్‌ మండలం హ స్నాబాద్‌ గ్రామానికి చెందిన వావిలాల సుదర్శన్‌ ఉక్రెయిన్‌లో మృతిచెందిన విషయం తెల్సిందే. ఆయ న మృతదేహాన్ని స్వదేశానికి తెప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంది. సీఎం ప్రవాసీ ప్రజావాణి ఉన్నతాధికారులు భారత రాయభార కార్యాలయం సమన్వయంతో ఈ నెల 31న ఆయన మృతదేహాన్ని స్వగ్రామానికి చేర్చేలా ఏర్పాట్లు చేశారు. ఉక్రెయిన్‌ గగనతలంలో విమాన రాకపోకలపై ఆంక్షలు ఉండటంతో భూమార్గంలో పొలాండ్‌కు రోడ్డు మా ర్గంలో తరలిస్తున్నారు. కేఎల్‌ఎం రాయల్‌డన్‌ ఎయిర్‌లైన్స్‌ విభాగం ద్వారా పొలాండ్‌లోని వార్సా ను ంచి నెదర్లాండ్స్‌లోని అమ్‌స్టర్‌డామ్‌కు.. అక్కడి నుంచి హైదరాబాద్‌కు తీసుకురానున్నారు.

లంచం డిమాండ్‌ చేసిన కానిస్టేబుల్‌ సస్పెన్షన్‌

మెట్‌పల్లి: ఓ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి నుంచి లంచం డిమాండ్‌ చేసిన కానిస్టేబుల్‌ సుదర్శన్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేసినట్లు తెలిసింది. మెట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ కానిస్టేబుల్‌ సుదర్శన్‌ స్థానిక సబ్‌ కోర్టు పరిధిలోని కేసులను పర్యవేక్షిస్తుంటాడు. ఇబ్రహీంపట్నం మండలం అమ్మక్కపేటకు చెందిన ఓ వ్యక్తి ఓ కేసులో కొంతకాలం క్రితం రిమాండ్‌కు వెళ్లి బెయిల్‌పై బయటకు వచ్చాడు. ఇంకా విచారణలో ఉన్న ఆ కేసు విషయంలో సుదర్శన్‌ సదరు వ్యక్తికి ఫోన్‌ చేసి లంచం డిమాండ్‌ చేశాడు. రికార్డు అయిన ఇద్దరి మధ్య సంభాషణల ఆడియోను ఆ వ్యక్తి బయటపెట్టగా.. అది ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో వారు విచారణ చేపట్టి సుదర్శన్‌ను సస్పెండ్‌ చేసినట్లు సమాచారం.

అనాథకు అంత్యక్రియలు

కోరుట్ల: అనాథకు అంత్యక్రియలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు కోరుట్ల పద్మశాలీ సంఘం నాయకులు. పట్టణానికి చెందిన శ్రీరామ్‌ లింబాద్రి (65) ఆదివారం ఉదయం అనారోగ్యంతో మృతి చెందాడు. ఆయనకు బంధువులు, తోబుట్టువులు ఎవరూ లేరు. విషయం తెలుసుకున్న పద్మశాలీ సంఘం నాయకులు రుద్ర శ్రీనివాస్‌, గుంటుక ప్రసాద్‌, జిందం లక్ష్మీనారాయణ, వసీం, సజ్జు, అడేపు నరేశ్‌ మానవత్వంతో స్పందించి తలా కొంత నగదు సమకూర్చి అంత్యక్రియలు పూర్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement