వేములవాడ: వేములవాడ భీమన్న క్షేత్రంలో ఆది వారం భక్తుల రద్దీ నెలకొంది. దసరా సెలవులు ముగియడంతో పాటు సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. కోడె మొక్కులు, అభిషేకాలు, అన్నపూజలు, కుంకుమ పూజలు, గండాదీపం, చండీహోమం, నిత్య కల్యాణం మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈవో రమాదేవి, డీఈవో ప్రతాప నవీన్లు క్యూలైన్లు, ప్రసాద వితరణ, భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.


