గుండెపోటుతో యువకుడి మృతి | - | Sakshi
Sakshi News home page

గుండెపోటుతో యువకుడి మృతి

Oct 26 2026 12:04 AM | Updated on Oct 26 2026 12:04 AM

చందుర్తి: మండలంలోని బండపల్లిలో ఆదివారం సాయంత్రం వేముల కనుకరాజు (25) అనే యువకుడు గుండెపోటుతో మృతి చెందాడు. బండపల్లికి చెందిన కనుకరాజు రెండేళ్లుగా గుండె సంబ ంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఆ రునెలల క్రితమే స్టంట్‌ పడగా నాలుగై దు రోజులుగా అస్వస్థతకు గురికావడంతో కుటుంబసభ్యులు కరీంనగర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షలు నిర్వహించి పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో వరంగల్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూనే గుండెపోటుతో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఒక్కగానొక్క కుమారుడు గుండెపోటుతో మృతి చెందడంతో కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement