కరీంనగర్‌కల్చరల్: చెడుపై ఎప్పటికై నా విజయం సాధించేది మంచేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ అన్నారు. దేవీ నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా సోమవారం కరీంనగర్‌లోని మహాశక్తి ఆలయంలో మహిషాసురమర్దిని అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయంలో నిర్వహించిన చండీ యాగంలో పాల్గొని భవానీ దీక్ష విరమించారు. సాయంత్రం రావణదహన కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా, విదేశాల్లోనూ దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తూ మనదేశ సంస్కృతిని పరిరక్షిస్తున్నారని వివరించారు. కరీంనగర్ మహాశక్తి ఆలయంలోనూ ఈసారి గతం కంటే ఘనంగా ఉత్సవాలు జరిగాయన్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి అని పేర్కొంటూ హిందూ బంధువులందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు.


