ప్రజల భద్రతే ప్రథమ కర్తవ్యం | - | Sakshi
Sakshi News home page

ప్రజల భద్రతే ప్రథమ కర్తవ్యం

Oct 20 2026 1:50 AM | Updated on Oct 20 2026 1:50 AM

● సీపీ గౌస్‌ ఆలం

కరీంనగర్‌క్రైం: శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ గౌస్‌ ఆలం ఆదేశించారు. సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించిన వారాంతపు నేర సమీక్ష సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, చట్టాలకు అనుగుణంగా కేసుల నమోదు, దర్యాప్తు ప్రక్రియ పకడ్బందీగా నిర్వహిస్తూ, నేరస్తులకు శిక్ష పడేలా ఆధారాల సేకరణకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. దసరా పండుగ నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని, రద్దీ ప్రాంతాల్లో నిరంతర నిఘా కొనసాగించాలని సూచించారు. పోలీస్‌ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకుని రక్తదాన శిబిరాలు, ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు, వ్యాసరచన పోటీలను విజయవంతంగా నిర్వహించాలని ఆదేశించారు.

ఘనంగా దసరా వేడుకలు

దసరా పండుగను పురస్కరించుకుని కమిషనరేట్‌ కేంద్రంలోని పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లో సోమవారం ఆయుధ, జమ్మి, వాహన పూజలు ఘనంగా నిర్వహించారు. సీపీ గౌస్‌ ఆలం పాల్గొని ప్రత్యేక పూజలు చేవారు. కమిషనరేట్‌ పరిధి ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమాల్లో అడిషనల్‌ డీసీపీ వెంకటరమణ, ఏసీపీలు శ్రీనివాస్‌, వెంకటస్వామి, విజయకుమార్‌, రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్లు జానీమియా, శ్రీధర్‌రెడ్డి, కిరణ్‌కుమార్‌, పలువురు పోలీస్‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement