● నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్
కరీంనగర్‌కార్పొరేషన్: ప్రజావాణిలో ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను సత్వరం పరిష్కరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్‌దేశాయ్ అధికారులను ఆదేశించారు. సోమవారం నగరపాలకసంస్థ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో అధికారులతో కలిసి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను ఆయా విభాగాలకు పంపించడం జరుగుతుందన్నారు. సంబంధిత విభాగాల అధికారులు దరఖాస్తుల ఆధారంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి వెంటనే పరిష్కరించాలని సూచించారు. కాగా, దసరా పండుగ సందర్భంగా ప్రజావాణికి దరఖాస్తుదారులు తక్కువగా వచ్చారు. మొత్తం ఆరు దరఖాస్తులు రాగా, అందులో టౌన్ ప్లానింగ్ రెండు, ఇందిరమ్మ ఇండ్లకు మూడు, శానిటేషన్‌కు ఒక దరఖాస్తు వచ్చాయి. డిప్యూటీ కమిషనర్ ఖాదర్ మొహియొద్దిన్, సహాయ కమిషనర్ రాజమనోహర్, డీసీపీ బషీరొద్దిన్ తదితరులు పాల్గొన్నారు.
జాతీయస్థాయి అవార్డుకు సైన్స్ టీచర్
చిగురుమామిడి: మండలంలోని ఇందుర్తి జిల్లా పరిషత్ పాఠశాలలో సైన్స్ టీచర్‌గా పనిచేస్తున్న బాషవత్తిని ఓదెల్‌కుమార్ జాతీయస్థాయి వరల్డ్ అలైన్సీ ప్రిన్సిపాల్ సమ్మేటివ్ అవార్డు– 2026కు ఎంపికయ్యాడు. 29 ఏళ్లుగా ఉపాధ్యాయులకు వృత్యంత శిక్షణ, సైన్స్ ప్రయోగదీపికలు, వర్క్‌బుక్స్, టీవీలో పాఠ్యాంశాల బోధన, విద్యార్థులకు సైన్స్ పాఠాలు బోధించినందుకు అవార్డుకు ఎంపికయ్యాడు. ఈనెల 25న న్యూఢిల్లీలో జరిగే కార్యక్రమంలో అవార్డు స్వీకరిస్తారు. ఈ సందర్భంగా ఓదెలుకుమార్‌ను ఎంఈవో జయప్రద, ఇందుర్తి సర్పంచ్ చింతపూల నరేందర్, ఉపసర్పంచ్ అనిల్‌కుమార్, తోటి ఉపాధ్యాయులు తదితరులు అభినందించారు.
గ్రామీణ విద్యార్థులు ఏఐపై దృషి పెట్టాలి
జమ్మికుంట: గ్రామీణ విద్యార్థులు ఏఐపై దృష్టి పెట్టాలని వీణవంక మండలకేంద్రానికి చెందిన యాప్ టీవీ అధినేత పాడి ఉదయానందరెడ్డి సూచించారు. శరన్నవరాత్రుల సందర్భంగా సోమవారం జమ్మికుంట పట్టణంలోని దుర్గామాత మండపాల్లో అమ్మవారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేశారు. 25 మండపాలకు రూ.5,016 చొప్పున ఆర్థికసాయం అందజేశారు. మన సంస్కృతి, సంప్రదాయాలు గొప్పవని, భక్తిభావంతో మండపాలు ఏర్పాటు చేసిన నిర్వాహకులు, భక్తులకు ధన్యవాదాలు తెలిపారు. ఏఐ, ట్రిపుల్ ఐటీ పరీక్షలకు కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని, ఈ ప్రాంత విద్యార్థులు ఉచిత శిక్షణ తీసుకొని భవిషత్‌లో ఉన్నతంగా ఎదగాలని సూచించారు.


