కరీంనగర్కార్పొరేషన్: దసరా ఉత్సవాలు, దుర్గామాత నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు. దసరా, దుర్గామాత నిమజ్జనం సందర్భంగా సోమవారం నగరంలో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మంగళవారం జరిగే దసరా ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు, 21న నిర్వహించే నిమజ్జనం ప్రశాంతంగా పూర్తి చేసుకునేందుకు నగరపాలకసంస్థ తరఫున ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. రూ.3 కోట్ల నిధులతో ఏర్పాట్లు చేశామని చెప్పారు. మానకొండూర్, కొత్తపల్లిలో దుర్గామాత విగ్రహాల నిమజ్జనం వేగవంతంగా, సురక్షితంగా జరిగేందుకు తగినన్ని క్రేన్లను సిద్ధం చేశామన్నారు. తాగునీటి వసతి తదితర సౌకర్యాలు గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచామన్నారు.


