● మంత్రి పొన్నం ప్రభాకర్
కరీంనగర్‌సిటీ: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేయడంపై బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. శాతవాహన పరిధిలో 49 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతినిచ్చిందని మంత్రి తెలిపారు. నియామకాలకు సంబంధించి ఈ నెలాఖరు వరకు నోటిఫికేషన్లు వెలువడనున్నాయని పేర్కొన్నారు. అర్హత గల నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
శాతవాహన పరిధిలోని ఖాళీలు..
హుస్నాబాద్‌లోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో కంప్యూటర్ సైన్స్‌లో ఇంజినీరింగ్ 7, సీఎస్‌ఈ– ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 7, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ 7, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 5, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ 1, మెకానికల్ ఇంజినీరింగ్ 2, ఇంగ్లిష్ 1, మ్యాథమెటిక్స్ 2, ఫిజిక్స్ 2, కెమిస్ట్రీ 2, ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ 1, లైబ్రేరియన్ 1 పోస్టులు హుస్నాబాద్‌లోని కాలేజీకి కేటాయించారు. కరీంనగర్ శాతవాహన క్యాంపస్‌లో యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా కాలేజీలో 8, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ (ఎల్‌ఎండీ క్యాంపస్)లో ఫార్మసీ 2, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో కామర్స్ 1 పోస్టు కేటాయించారు.


