జమ్మికుంట: పట్టణంలోని ఓ జువెల్లరి షాపు షార్ట్ సర్క్యూట్తో దగ్ధమైంది. బాధితులు తెలిపిన వివరాలు.. పట్టణంలోని కాసుల కిరణ్, మహేశ్, భాస్కర్ ముగ్గరు అన్నదమ్ములు శ్రీవిజయలక్ష్మి జువెల్లరి వర్క్షాపు నిర్వహిస్తున్నారు. సోమవారం షార్ట్ సర్క్యూట్తో విద్యుత్ మీటర్ నుంచి మంటలు చెలరేగాయి. స్థానికులు వెంటనే ఫైర్ స్టేషన్, పోలీసులకు సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పివేశారు. షాపులోని ఫర్నిచర్, వస్తువులు దగ్ధమయ్యాయి. ఈ ఘటపై ఎలాంటి ఫిర్యాదు రాలేదని టౌన్ సీఐ రామకృష్ణ తెలిపారు.


