పుష్పాలంకరణలో అమ్మవారు | - | Sakshi
Sakshi News home page

పుష్పాలంకరణలో అమ్మవారు

Oct 19 2026 7:18 AM | Updated on Oct 19 2026 7:18 AM

కరీంనగర్‌ కల్చరల్‌: దేవి శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా ఆదివారం మహాశక్తి ఆలయంలో అమ్మవారు మహాదుర్గాదేవి (మహాగౌరి) అవతారంలో పుష్పాలంకరణతో భక్తులకు దర్శనమిచ్చారు. మహాలక్ష్మి, మహా సరస్వతి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించారు.

మంత్రి పొన్నం పూజలు

కరీంనగర్‌ రూరల్‌: శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం కరీంనగర్‌ మండలం నగునూరులోని శ్రీ దుర్గాభవానీ ఆలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ చైర్మన్‌ వంగల లక్ష్మణ్‌, ప్రతినిధులు పవన్‌కుమార్‌ శాలువా కప్పి సత్కరించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ సత్తు మల్లేశం, అర్బన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు వైద్యుల అంజన్‌కుమార్‌, కరీంనగర్‌ సొసైటీ డైరెక్టర్‌ సాయిల్ల మ హేందర్‌ పాల్గొన్నారు.

ముగిసిన క్రికెట్‌ శిబిరం

కరీంనగర్‌స్పోర్ట్స్‌: హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో అలుగునూరులోని వీజేఆర్‌ క్రికెట్‌ గ్రౌండ్‌ అకాడమీలో అక్టోబర్‌ 10 నుంచి 18 వరకు నిర్వహించిన మహిళల రెసిడెన్షియల్‌ క్రికెట్‌ శిక్షణ శిబిరం ఆదివారంతో ముగిసింది. కరీంనగర్‌, ఆదిలాబాద్‌, మెదక్‌, నిజామాబాద్‌ జిల్లాలకు చెందిన సుమారు 50మంది మహిళా క్రికెటర్లు శిబిరంలో పాల్గొన్నారు. ముగింపు కార్యక్రమంలో కరీంనగర్‌ జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ తరఫున హెచ్‌సీఏ మహిళల క్రికెట్‌ ఆపరేషన్స్‌ హెడ్‌ శ్రీమతి సునీత ఆనంద్‌, హెచ్‌సీఏ సభ్యులు అన్నామేరీ, రేవతిని సత్కరించారు. కేడీసీఏ అధ్యక్షుడు ఆగంరావు, ఉపాధ్యక్షుడు మహేందర్‌గౌడ్‌, కార్యదర్శి మనోహర్‌రావు, కార్యవర్గ సభ్యులు అజిత్‌రావు, విద్యాసాగర్‌, హరికృష్ణ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement