ముంబయిలో బతుకమ్మ వేడుకలు | - | Sakshi
Sakshi News home page

ముంబయిలో బతుకమ్మ వేడుకలు

Oct 19 2026 2:07 AM | Updated on Oct 19 2026 2:07 AM

జగిత్యాలరూరల్‌: మహారాష్ట్రలోని ముంబయి నగరం థానేలో ఆదివారం గౌడ సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహిళలు బతుకమ్మ ఆడిపాడారు.

లండన్‌ మహానగరంలో బ్రిస్టల్‌ తెలుగు అసోసియేషన్‌ ఆధ్వర్యంలో శనివారం రాత్రి బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళల బతుకమ్మ ఆటలు, చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వేడుకల్లో దాదాపు 500 కుటుంబాలు పాల్గొన్నాయని బ్రిస్టల్‌ తెలుగు అసోసియేషన్‌ నిర్వాహకుడు అంతగిరి అశోక్‌కుమార్‌ తెలిపారు. శ్రీదేవి, నవీన్‌కుమార్‌, బ్రిస్టల్‌ పారిస్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ శ్రీనివాస కిరీటి తదితరులు పాల్గొన్నారు. – ఇల్లంతకుంట

ఖండాంతరాల్లో బతుకమ్మ సంబురం

కాల్వశ్రీరాంపూర్‌: తెలంగాణ బతుకమ్మ ఖ్యాతి ఖండంతరాలకు చేరింది. ఆస్ట్రేలియా అడన్‌లో బతుకమ్మ సంబరాలు అంబరాన్ని తాకాయి. అమెరికా లూసియానా స్టేట్‌ లఫైట్‌ శ్రీకృష్ణ బాలాజీ టెంపుల్‌లో వేడుకలను ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా వాసులు ఘనంగా జరుపుకున్నారు. దుబాయిలోని గల్ఫ్‌ తెలంగాణ వెల్ఫేర్‌ కల్చరల్‌ అసోసియేషన్‌ నేతృత్వంలో ఆల్‌ముల్లా ప్లాజా శబాబ్‌ ఆల్‌ అబి కల్బ్‌లో ఉత్సవాలు అంబరాన్నంటాయి. ఆయా ప్రాంతాల్లో పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్‌ మండలానికి చెందిన ఇమ్మడి సాయిరాం, గోదావరిఖని ఎన్టీపీసీకి చెందిన ఇరుకుల వినీత్‌ దంపతులు, కరీనంగర్‌కు చెందిన గుండా సతీశ్‌ దంపతులు సంబురాల్లో పాల్గొన్నారు.

లండన్‌లో బతుకమ్మ సంబరాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement