ఒకే ఇంట్లో రెండు బతుకమ్మలు వద్దన్న ఇంటి యజమాని | - | Sakshi
Sakshi News home page

ఒకే ఇంట్లో రెండు బతుకమ్మలు వద్దన్న ఇంటి యజమాని

Oct 19 2026 2:07 AM | Updated on Oct 19 2026 2:07 AM

● గుడిసెలో బతుకమ్మ పేర్చిన కిరాయిదారు

ఇల్లంతకుంట: ఒకే ఇంట్లో రెండు బతుకమ్మలు పేర్చవద్దని ఇంటి యజమాని అనడంతో.. కిరాయిదారు గుడిసెలో బతుకమ్మ పేర్చిన ఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం దాచారం గ్రామంలో జరిగింది. దాచారం గ్రామానికి చెందిన దరిపెల్లి చంద్రశేఖర్‌ పూరి గుడిసె దెబ్బతినడంతో కుటుంబంతో అద్దె ఇంట్లో జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం అద్దె ఇంట్లో బతుకమ్మ పేర్చేందుకు సిద్ధం కాగా, ఒకే ఇంట్లో రెండు బతుకమ్మలు పేర్చవద్దని ఇంటి యజమాని చెప్పాడు. దీంతో తన గుడిసెలో బతుకమ్మ పేర్చానని చంద్రశేఖర్‌ వాపోయాడు. తాను ఇందిరమ్మ ఇల్లు కోసం దరఖాస్తు చేసుకున్నానని ఇల్లు కేటాయించలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు ఫోర్‌ వీలర్‌ వాహనం ఉందన్న కారణంతో ఇందిరమ్మ ఇల్లు కేటాయించలేదని, దీంతో తన వాహనాన్ని అమ్ముకున్నానని తనకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని అధికారులను వేడుకుంటున్నాడు. ఈ విషయంపై పంచాయతీ కార్యదర్శి వరుణ్‌ మాట్లాడుతూ, 2024 డిసెంబర్‌లో ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు విచారించే సమయంలో చంద్రశేఖర్‌ పేరిట ఫోర్‌ వీలర్‌ ఉన్నట్లు ఆన్‌ఐన్‌లో చూపెట్టిందని, అందుకే ఇల్లు రాలేదని తెలిపారు.

పీఆర్‌టీయూటీఎస్‌ అధ్యక్షులుగా శంకర్‌, బాల్‌రెడ్డి

గంభీరావుపేట(సిరిసిల్ల): పీఆర్‌టీయూటీఎస్‌ రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షులుగా గంభీరావుపేట మండలశాఖ నాయకులు పంతులవారి శంకర్‌, పొన్నాల బాల్‌రెడ్డి ఎన్నికయ్యారు. ఇటీవల నల్గొండ జిల్లాలో జరిగిన రాష్ట్ర కౌన్సిల్‌ సమావేశంలో నూతన రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. వీరికి జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్‌రావు, కిషన్‌, మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మార్గల రాజేశ్‌, సాంబారి లక్ష్మీనారాయణ తదితరులు అభినందనలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement