● గుండెపోటుతో సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి
కథలాపూర్(వేములవాడ): దసరా ఉత్సవాల కోసం హైదరాబాద్ నుంచి ఇంటికొచ్చిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి గుండెపోటుతో మృతిచెందడం కథలాపూర్లో విషాదం నెలకొంది. కథలాపూర్ గ్రామానికి చెందిన పూండ్ర జగన్రెడ్డి(38) హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగి. భార్యాపిల్లలతో హైదరాబాద్లోనే ఉంటున్నాడు. దసరా ఉత్సవాల కోసం ఈనెల 17న కథలాపూర్కు వచ్చారు. ఆదివారం మధ్యాహ్నం చాతిలో నొప్పి వస్తోందని కుటుంబసభ్యులకు తెలపడంతో హుటాహుటిన చికిత్స కోసం కోరుట్ల ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గంమధ్యలోనే మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.


