● మరొకరికి తీవ్ర గాయాలు
రుద్రంగి: బతుకమ్మ పూల కోసం అటవీప్రాంతానికి వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి చేయగా, తీవ్రంగా గాయపడ్డాడు. వివరాలు.. రుద్రంగి మండల కేంద్రానికి చెందిన వంకాయల లక్ష్మణ్ ఆదివారం ఉదయం బతుకమ్మ పూల కోసం రుద్రంగి శివారులోని నాగారం చెరువు ప్రాంతంలో గల అటవీప్రాంతానికి స్నేహితులతో కలిసి వెళ్లాడు. అందరూ తలో దిక్కు వెళ్లి బతుకమ్మ పూలు కోస్తుండగా, లక్ష్మణ్‌పై అకస్మాత్తుగా ఎలుగుబంటి దాడి చేసింది. మిగతావారు గట్టిగా అరవడంతో ఎలుగుబంటి పారిపోయింది. తీవ్రంగా గాయపడిన లక్ష్మణ్‌ను చికిత్స కోసం కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
వేములవాడరూరల్: వేములవాడరూరల్ మండలం ఫాజుల్‌నగర్ గ్రామానికి చెందిన గడ్డం దేవయ్య (53) ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. దేవయ్య కూలీ పని చేస్తూ వచ్చిన డబ్బుతో అతిగా మద్యం సేవిస్తూ, డబ్బులు వృథా ఖర్చు చేస్తుండేవాడు. కుటుంబసభ్యులు చాలా సార్లు చెప్పినా వినకుండా మద్యానికి బానిసయ్యాడు. శనివారం రాత్రి అతిగా మద్యం తాగి మత్తులో ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. వట్టెంల శివారులో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య సరోజన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఏఎస్సై మజీద్ తెలిపారు.
జూలపల్లి: పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం పెద్దాపూ ర్ గ్రామానికి చెందిన మానుమండ్ల లోకేశ్(21) శనివారం రాత్రి ఉరివేసు కుని ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రా మానికి చెందిన మానుమండ్ల అంజ మ్మ – అర్జయ్య దంపతులకు ఇద్దరు కుమారులు. అంజమ్మ భర్త ఇరవై ఏళ్ల క్రితం మృతి చెందాడు. కాయకష్టం చేస్తూ తన ఇద్దరు పిల్లలను పోషిస్తూ వస్తోంది. అయితే, చిన్నకుమారుడు లోకేశ్ సెంట్రింగ్ పనిచేస్తూ మద్యానికి అలవాటుపడ్డాడు. ఎప్పటిలాగే శనివారం రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చి పడుకున్నాడు. తెల్లవారు జామున తల్లి లేచిచూసే సరికి ఇంట్లో ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని మృతి చెంది కనిపించాడు. మద్యం మత్తులోనే ఉరి వేసుకుని మరణించినట్లు తల్లి అంజమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈమేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ మల్లేశ్ తెలిపారు.
● మరొకరికి తీవ్ర గాయాలు
కొడిమ్యాల: గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇద్దరు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడిన ఘటన కొడిమ్యాల మండలంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్సై నరేష్ కుమార్ కథనం ప్రకారం.. కరీంనగర్ నగరంలోని అశోక్‌నగర్‌లోని ఓ ఎలక్ట్రికల్ దుకాణంలో పనిచేస్తున్న సంపలాల్ (30), ఈశ్వర్‌సింగ్ (25), అబారామ్ కొండగట్టు ఆంజనేయస్వామి దర్శనానికి వచ్చారు. తిరిగి కరీంనగర్‌కు బైక్‌పై బయల్దేరారు. ఈ క్రమంలో కొడిమ్యాల మండలం పూడూర్ సమీపంలోని రామాలయం వద్ద వీరి బైక్‌ను గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ఈ ఘటనలో సంపలాల్, ఈశ్వర్‌సింగ్ అక్కడికక్కడే మృతి చెందారు. అబారామ్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు.
రెండు బైకులు ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు
వెల్గటూర్: రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడిన సంఘటన ఎండపల్లి మండలకేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. ఎండపల్లికి చెందిన రాజయ్య పొలానికి వెళ్లి తిరిగి వస్తున్నాడు. అదే సమయంలో కొండాపూర్ గ్రామానికి చెందిన క్రాంతి ఎండపల్లి వైపు వస్తూ.. ఎదురెదురుగా ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు.
ఎలుగుబంటి దాడిలో ఒకరికి..
మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య
మద్యం మత్తులో..
గాయపడిన క్రాంతి
గాయపడిన రాజయ్య