ఎలక్ట్రిక్‌ వాహనంలో మంటలు | - | Sakshi
Sakshi News home page

ఎలక్ట్రిక్‌ వాహనంలో మంటలు

Oct 13 2026 12:05 AM | Updated on Oct 13 2026 12:05 AM

ఇబ్రహీంపట్నం: మండలంలోని గోదూర్‌ శివారులో సోమవారం ఎలక్ట్రికల్‌ బైక్‌ ప్రమాదవశాత్తు కాలిపోయింది. మండలంలోని వర్షకొండ గ్రామానికి చెందిన నారే రాము, సరిత దంపతులు తమ రెండేళ్ల కుమారుడు వరుణ్‌తో ఎలక్ట్రిక్‌ బైక్‌పై మెట్‌పల్లికి వెళ్లారు. తిరిగి వస్తుండగా వాహనం నుంచి పొగలు వచ్చాయి. రాము వాహనాన్ని ఆపి చూస్తుండగానే.. ఒక్కసారిగా మంటలు లేచాయి. బైక్‌ పూర్తిగా కాలిబూడిదైంది. చుట్టు పక్కల రైతులు నీరు చల్లినా మంటలు చల్లారలేదు. భార్యాభర్తలతోపాటు కుమారుడు క్షేమంగా బయటపడటంతో ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement