జేఎన్‌టీయూ కళాశాలను వర్సిటీగా అప్‌గ్రేడ్‌ చేయాలి | - | Sakshi
Sakshi News home page

జేఎన్‌టీయూ కళాశాలను వర్సిటీగా అప్‌గ్రేడ్‌ చేయాలి

Sep 30 2026 2:04 AM | Updated on Sep 30 2026 2:04 AM

● సీఎం రేవంత్‌రెడ్డికి మాజీ మంత్రి జీవన్‌రెడ్డి లేఖ గుండె ఆరోగ్యం పదిలం ● అవగాహన పెంచేందుకే 3కే వాక్‌థాన్‌ ● కరీంనగర్‌ సీపీ గౌస్‌ ఆలం

● సీఎం రేవంత్‌రెడ్డికి మాజీ మంత్రి జీవన్‌రెడ్డి లేఖ

కరీంనగర్‌: జగిత్యాల జిల్లా నాచుపల్లిలోని జేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ కళాశాలను యూనివర్సిటీగా అప్‌గ్రేడ్‌ చేసే దిశగా రాష్ట్రప్రభుత్వం చర్యలు చేపట్టాలని జగిత్యాల మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్‌రెడ్డి కోరారు. కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో నూతన కలెక్టరేట్‌ ప్రారంభోత్సవానికి బుధవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రానున్న నేపథ్యంలో జీవన్‌రెడ్డి మంగళవారం సీఎంకు లేఖరాశారు. ఉత్తర తెలంగాణ విద్యార్థులకు సాంకేతిక విద్య, ఆధునాతన కోర్సులు, పరిశోధన, స్టార్టప్‌ అవకాశాలు అందుబాటులోకి రావాలంటే కళాశాలను యూనివర్సిటీగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. 2006లో నాచుపల్లి శివారులో సుమారు 100 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఏర్పాటైన ఈ కళాశాలలో ఏటా సుమారు 1,500 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని తెలిపారు. అధునాతన ల్యాబ్‌లు, డిజిటల్‌ లైబ్రరీ, హాస్టల్‌ సౌకర్యాలతోపాటు నాణ్యమైన విద్యాబోధన, క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లతో కళాశాల మంచి గుర్తింపు పొందిందన్నారు. ప్రస్తుతం కళాశాల పరిధిలో సుమారు 200 ఎకరాల వరకు ప్రభుత్వ భూమి అందుబాటులో ఉన్నందున యూనివర్సిటీ ఏర్పాటుకు అవసరమైన మౌలిక వసతులు, పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉందని జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. జగిత్యాల జేఎన్‌టీయూను యూనివర్సిటీగా అప్‌గ్రేడ్‌ చేయడంతో ఉత్తర తెలంగాణలోని పలుజిల్లాల విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని, ఈ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆయన సీఎంను కోరారు.

కరీంనగర్‌: ఉరుకులు, పరుగుల జీవితంలో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే గుండైపె ప్రభావం పడుతుందని, ఆరోగ్యకరమైన జీవనశైలి అలవర్చుకోవడం ద్వారా గుండెను పదిలంగా ఉంచుకోవడంతోపాటు సంతోషంగా, ఎక్కువకాలం జీవించవచ్చని కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ గౌస్‌ఆలం అన్నారు. వరల్డ్‌ హార్ట్‌డేను పురస్కరించుకొని కరీంనగర్‌ మెడికవర్‌ ఆస్పత్రి ఆధ్వర్యంలో మంగళవారం 3కే వాక్‌థాన్‌ చేపట్టగా సీపీ జెండా ఊపి ప్రారంభించారు. వైద్యులు మాట్లాడుతూ.. గుండె జబ్బు లక్షణాలు కనిపించిన వెంటనే ఆస్పత్రికి వస్తే 24 గంటల్లోనే స్టంట్‌ వేసి పంపించే టెక్నాలజీ కరీంనగర్‌లో అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. మెడికవర్‌ సెంటర్‌ హెడ్‌ గుర్రం కిరణ్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ వాకథాన్‌లో వైద్యులు అనీశ్‌ పబ్బ, వాసుదేవరెడ్డి, సతీశ్‌కుమార్‌, రవి కుమార్‌, వినయ్‌కుమార్‌, విష్ణువర్ధన్‌రెడ్డి, నాగరాజు, లోకేశ్‌, రాకేశ్‌, రాజీవ్‌రెడ్డి, ఉపేందర్‌రెడ్డి, అభిషేక్‌, రవిశంకర్‌, శ్రీపతినాయుడు, సిబ్బంది ప్రియాంక, గౌస్‌బాబా, కోట కరుణాకర్‌, ఈశ్వర్‌, సాయిచరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement