306 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత | - | Sakshi
Sakshi News home page

306 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత

Sep 30 2026 1:16 AM | Updated on Sep 30 2026 1:16 AM

కరీంనగర్‌క్రైౖం: నగరంలోని హనుమాన్‌ ఇండస్ట్రీస్‌ రైస్‌మిల్లులో కరీంనగర్‌ టూటౌన్‌, టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు మంగళవారం తనిఖీలు నిర్వహించి 306.88 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యంతో పాటు ట్రాలీ ఆటోను స్వాధీనం చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పద్మనగర్‌ ఇండస్ట్రీయల్‌ ఏరియాలోని హనుమాన్‌ ఇండస్ట్రీస్‌ రైస్‌మిల్లులో పీడీఎస్‌ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసి పాలిష్‌ చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో మంగళవారం తనిఖీలు నిర్వహించారు. 306.88 క్వింటాళ్ల రేషన్‌ బియ్యంతో పాటు రవాణాకు సిద్ధంగా ఉన్న ట్రాలీ ఆటోను స్వాధీనం చేసుకున్నారు. మిల్లు యజమాని కరుణాకర్‌తోపాటు గుమస్తా, అకౌంటెంట్‌, సప్లయర్‌, డ్రైవర్‌ సహకారంతో రేషన్‌ లబ్ధిదారుల నుంచి తక్కువ ధరకు బియ్యాన్ని సేకరిస్తున్నట్లు గుర్తించారు. ఆ బియ్యాన్ని పాలిష్‌ చేసి వివిధ తదితర బ్రాండ్ల పేర్లతో సంచుల్లో ప్యాకింగ్‌ చేసి సన్నబియ్యంగా విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement