రైలులో ప్రయాణికుడికి అస్వస్థత | - | Sakshi
Sakshi News home page

రైలులో ప్రయాణికుడికి అస్వస్థత

Sep 30 2026 1:16 AM | Updated on Sep 30 2026 1:16 AM

రామగుండం: మధురై–హజ్రత్‌ నిజాముద్దీన్‌ చండగఢ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో ఓ ప్రయాణికుడు తీవ్ర అస్వస్థతకు గురైనట్లు సోమవారం అర్ధరాత్రి ప్రభుత్వ రైల్వే పోలీసులకు సమాచారం అందింది. రైలు రామగుండం రైల్వేస్టేషన్‌ చేరుకున్న తర్వాత ప్రయాణికుడిని కిందకు దించి 108కు సమాచారం అందించారు. సిబ్బంది వెంటనే రైల్వేస్టేషన్‌ చేరుకుని పరిశీలించగా.. అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతుడి వద్ద లభించిన మెడికల్‌ రసీదుపై నవీదత్‌ అని రాసి ఉండగా ఇతర ఆధారాలేమీ లభ్యం కాలేదు. మృతదేహాన్ని గోదావరిఖని ప్రభుత్వ ఆస్ప త్రిలోని మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేపడుతున్నట్లు జీఆర్పీ ఔట్‌ పోస్టు ఇన్‌చార్జి తిరుపతి మంగళవారం తెలిపారు. మృతుడి బంధువులు 99493 04574, 87126 58604 నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు.

ఒకరి అనుమానాస్పద మృతి

తంగళ్లపల్లి(సిరిసిల్ల): పొలం వద్దకు వెళ్లిన ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ ఘటన తంగళ్లపల్లిలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బొల్లారం శంకరయ్య (58) సోమవారం సాయంత్రం పొలం వద్దకు వెళ్లాడు. రాత్రయినా ఇంటికి రాకపోవడం, ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ రావడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. మంగళవారం ఉదయం భార్య ఎల్లవ్వ పొలం వద్దకు వెళ్లి చూడగా, నీళ్ల కుండి పక్కన విగతజీవిగా పడి ఉన్నాడు. గతంలో ఆయనకు గుండెపోటు వచ్చిందని, ఇప్పుడు గుండెపోటుతో మరణించాడా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో అనుమానం వ్యక్తం చేస్తూ భార్య ఎల్లవ్వ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై సిరిసిల్ల అశోక్‌ తెలిపారు.

హైదరాబాద్‌–దాణాపూర్‌ రైలు గడువు పొడిగింపు

రామగుండం: హైదరాబాద్‌–దాణాపూర్‌ ప్రత్యే క రైలు గడువును పెంచుతూ దక్షిణ మధ్య రైల్వే ఉత్తర్వులు జారీచేసింది. రద్దీ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. హైదరాబాద్‌–దాణాపూర్‌(07091) మధ్య ప్రతీ శనివారం.. అక్టోబర్‌ 3 నుంచి నవంబర్‌ 28వ వర కు, దాణాపూర్‌–హైదరాబాద్‌(07092) మధ్య ప్రతీ సోమవారం.. అక్టోబర్‌ 5 నుంచి నవంబర్‌ 30వ తేదీ వరకు నడిపిస్తామని పేర్కొంది.

ఆర్‌ఎఫ్‌సీఎల్‌ను నీరుగార్చితే సహించేదిలేదు

ఫెర్టిలైజర్‌సిటీ: రామగుండం ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌(ఆర్‌ఎఫ్‌సీఎల్‌)ను ప్రైవేటీరించే యత్నాలు జరుగుతున్నాయని, వీటిని ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేదిలేదని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ హెచ్చరించారు. ప్రాజెక్టును నీరుగార్చితే రామగుండం నుంచి ఢిల్లీ వరకు పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఏటా 12.7 లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియా ఉత్పత్తి చేయాల్సిన ఆర్‌ఎఫ్‌సీఎల్‌ తరచూ ఎదురవుతున్న సాంకేతిక సమస్యలు, షట్‌డౌన్లతో కేవలం 7 లక్షల మెట్రిక్‌ టన్నుల నుంచి 8 లక్షల మెట్రిక్‌ టన్నులకే పరిమితమ వుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకు కేంద్రప్రభుత్వ తీరే కారణమని ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement