నీళ్లివ్వకుంటే రోడ్లపైనే నిమజ్జనం | - | Sakshi
Sakshi News home page

నీళ్లివ్వకుంటే రోడ్లపైనే నిమజ్జనం

Sep 21 2026 6:41 AM | Updated on Sep 21 2026 6:41 AM

నీళ్లివ్వకుంటే రోడ్లపైనే నిమజ్జనం ● కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ హెచ్చరిక

కరీంనగర్‌ కార్పొరేషన్‌: ఎస్సారెస్పీ ద్వారా నీళ్లు వదలకపోతే రోడ్లపైనే వినాయక నిమజ్జనం చేస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ హెచ్చరించారు. శాంతిభద్రతల సమస్య వస్తే ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు. నగరపాలకసంస్థ నూతనంగా కొనుగోలు చేసిన రెండు ఫాగింగ్‌ మిషన్లు, 66 ట్రైసైకిళ్లను ఆదివారం నగరపాలకసంస్థ కార్యాలయంలో మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌, డిప్యూటీ మేయర్‌ యాదగిరి సునీల్‌రావు, కమిషనర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం మా ట్లాడుతూ.. గతంలో అవసరం ఉంటే నిమజ్జనానికి మూడు రోజుల ముందే ఎస్సారెస్పీ నుంచి నీళ్లు వదిలేవారన్నారు. ఈ సారి నీళ్లు విడుదల చేయాలని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో ఇప్పటికే మాట్లాడానని తెలిపారు. గతంలో 15టీఎంసీలు ఉన్నా నీళ్లు వదలారని, ఇప్పుడు 40టీఎంసీలు ఉన్నాయన్నారు. నిమజ్జనానికి నీళ్లు వదలకపోతే రోడ్లపైనే నిమజ్జనం చేయాల్సి వస్తుందన్నారు. నగరంలో పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధతో నూతనంగా వాహనాలు కొంటున్నామన్నారు. చెత్త తరలించేందుకు గతంలో రెండు డివిజన్లకు ఒక ఆటో, ట్రాక్టర్‌ ఉండేదన్నారు. డివిజన్‌కో రిక్షా చొప్పున 66 రిక్షాలు అందుబాటులోకి తెచ్చామన్నా రు. ఫాగింగ్‌ మిషన్‌ గతంలో నెలకొసారి డివిజన్‌కు వచ్చేదని, ఇప్పుడు వారం, పదిరోజులకోసారి ఫాగింగ్‌ అందుబాటులోకి వస్తుందన్నారు. వీటితో పాటు ల్యాడర్‌, వైకుంఠరథాలు, జేసీబీ కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. టవర్‌సర్కిల్‌లో పార్కింగ్‌ సమస్య తీర్చేందుకు రూ.25 కోట్లతో భవనం నిర్మిస్తున్నామన్నారు. అనంతరం నగరపాలకసంస్థ కార్యాలయంలో వినాయకుడికి పూజలు చేశారు. కార్పొరేటర్లు వాసాల రమేశ్‌, వైద్యుల అంజన్‌కుమార్‌, బండారి వేణు, బోయినపల్లి ప్రవీణ్‌రావు, బండ రమణారెడ్డి, వరాల నర్సింగం, సోమిడి వేణు, రాజేందర్‌, ప్రభావతి, జయశ్రీ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement