రాష్ట్రస్థాయి సైన్స్‌ ఫెస్టివల్‌కు అల్ఫోర్స్‌ విద్యార్థులు | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి సైన్స్‌ ఫెస్టివల్‌కు అల్ఫోర్స్‌ విద్యార్థులు

Sep 19 2026 6:14 AM | Updated on Sep 19 2026 6:14 AM

రాష్ట్రస్థాయి సైన్స్‌ ఫెస్టివల్‌కు అల్ఫోర్స్‌ విద్యార్థులు

కొత్తపల్లి(కరీంనగర్‌): కొత్తపల్లిలోని అల్ఫోర్స్‌ ఇ–టెక్నో పాఠశాల విద్యార్థులు జిల్లా స్థాయి సౌత్‌ సైన్స్‌ డ్రామా పోటీల్లో ప్రథమ స్థానం సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై టన్లు విద్యా సంస్థల చైర్మన్‌ డా.వి.నరేందర్‌రెడ్డి తెలిపారు. స్థానిక పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన అభినందన సభలో విద్యార్థులు మాన్యశ్రీ, ఎన్‌.ఇషిత, ఈ.శ్రీకర్‌రెడ్డి, ఎం.ఆద్య, ఎం.ఆశానా, వై.శృతిజ్ఞ (7వ తరగతి), ఎన్‌.రేహాంశ్‌ సాయవి, సీహెచ్‌ రేహాన్‌ కార్తికేయను అభినందించారు. సైన్స్‌ను ప్రయోగాత్మకంగా, విశ్లేషణాత్మకంగా నేర్చుకోవడం ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆలోచనా శక్తి పెరుగుతాయన్నారు. విద్యార్థులు సైన్స్‌పై పట్టు సాధించి పోటీ పరీక్షలు, వివిధ పోటీల్లో చురుగ్గా పాల్గొనాలని సూచించారు. కరీంనగర్‌లోని సైన్స్‌ టాలెంట్‌ మ్యూజియంలో నిర్వహించిన పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు త్వరలో హైదరాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని, అక్కడా విజయం సాధించి జాతీయస్థాయికి ఎంపిక కావాలని ఆకాంక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement