న్యూస్‌రీల్
సోమవారం శ్రీ 14 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026
మార్కెట్లో సందడి.. నేడు వినాయక చవితి
కరీంనగర్ కల్చరల్: చవితి పండుగ వచ్చేసింది. గల్లీగల్లీలో సంబురాలు తీసుకొచ్చింది. ఊరూరా గణేశ్ ఆగమనం వైభవంగా జరుగుతుండగా.. మార్కెట్లో పండుగశోభ నెలకొంది. గణనాథుడి పూజకు అవసరమైన సామగ్రి, విగ్రహాల కొనుగోలుతో ఆదివారం కరీంనగర్ మార్కెట్ కిటకిటలాడింది. మట్టి, పర్యావరణహిత ప్రతిమలు వివిధ ఆకృతులు, పరిమాణాల్లో అందుబాటులో ఉన్నాయి. నచ్చిన విగ్రహాన్ని కొనుగోలు చేస్తూ.. భక్తులు డప్పుచప్పుళ్లు.. డీజే మోతలతో ఘన స్వాగతం పలుకుతున్నారు. భాద్రపద శుద్ధ చవితి సోమవారం రోజున ప్రారంభమయ్యే ఉత్సవాలు నవరాత్రుల పాటు కొనసాగుతాయి. ఊరూవాడ గణపతి బప్పా నామస్మరణలతో మార్మోగనుంది. వెలుగులు విరజిమ్మే మండపాలు.. భజనలు.. పూజలు.. అభిషేకాలు .. అర్చనలు.. అన్నదానాలతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకోనుంది.
నగర శివారులోని వినాయకుల విక్రయ దుకాణం నుంచి భారీ విగ్రహాన్ని తీసుకెళ్తున్న నిర్వాహకులు
మార్కెట్లో పూజకు పత్రి కొనుగోలు చేస్తున్న భక్తులు
బుజ్జి గణపయ్యలను పరిశీలిస్తూ..


