వరంగల్‌కు నాన్‌స్టాప్ బస్సులు పరిశీలిస్తున్నాం
ఎన్‌హెచ్–563 సౌకర్యంతో అధ్యయనం చేస్తున్నాం
ప్రయాణికుల డిమాండ్‌కు అనుగుణంగా నిర్ణయం
మహాలక్ష్మికి 70 అదనపు బస్సులు.. 11 డిపోలకు కేటాయింపు
సిటీ బస్సులకు ఆశించిన ఆదరణ లేదు
పండుగ వేళల్లో 150 నుంచి 200 అదనపు బస్సులు
‘సాక్షి’ ఇంటర్వ్యూలో కరీంనగర్ రీజినల్ మేనేజర్ రాజు
సాక్షిప్రతినిధి, కరీంనగర్: ‘టీజీఎస్ ఆర్టీసీ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా మేనేజ్‌మెంట్ పనిచేస్తోంది. రద్దీకి అనుగుణంగా బస్సులు నడుపుతున్నాం. ఇప్పుటివరకు 6.91 కోట్ల మంది మహిళలు మహాలక్ష్మి ద్వారా ప్రయాణించి, రూ.308.84 కోట్ల వరకు లబ్ధి పొందారు. ఈ పథకం గొప్ప మైలురాయి సాధించింది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, ఎన్నికల ప్రక్రియ ప్రభుత్వ పాలసీ పరిధిలోనిది. రీజియన్ పరిధిలోని 11 డిపోల్లో 997బస్సులు రోజుకు 3లక్షల కిలోమీటర్లు తిరుగుతాయి. తద్వారా రూ.2.5కోట్ల ఆదాయం సమకూరుతోంది’ అని ఆర్టీసీ కరీంనగర్ ఆర్‌ఎం రాజు పేర్కొన్నారు.
‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలు వివరించారు.


