విద్యానగర్(కరీంనగర్): వినాయక చవితి రద్దీకి అనుగుణంగా అదనపు బస్సులు నడపాలని ఆర్టీసీ కరీంనగర్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పగిడిమర్రి సోలమన్ జోన్ పరిధిలోని రీజినల్ మేనేజర్లకు సూచించారు. మంగళవారం కరీంనగర్ బస్‌స్టేషన్ ఆవరణలోని తన కార్యాలయంలో రీజియన్ల ఆర్థిక స్థితిగతులపై సమీక్షించారు. వినాయక చవితి సందర్భంగా ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా తగిన బస్సులు నడపాలని సూచించారు. ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ రీజినల్ మేనేజర్లు డి.విజయభాను, బి,రాజు, ఎ.శారీరం, ఎస్, భవానీప్రసాద్, కరీంనగర్ జోన్‌లోని పర్సనల్ ఆఫీసర్స్ ఎం.సంపత్ కుమార్, వీరన్న, శ్యామలదేవి పాల్గొన్నారు.


