మల్యాల: జగిత్యాల జిల్లా కొండగట్టులోని శ్రీఆంజనేయస్వామి వారిని హైడ్రా కమిషనర్ రంగనాథ్ మంగళవారం కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి తీర్థ, ప్రసాదాలు అందించారు. కొండగట్టు అంజన్నను దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ఆలయ ఈవో అంజనా రెడ్డి, ప్రధాన అర్చకులు జితేంద్రప్రసాద్, ఉప ప్రధాన అర్చకులు చిరంజీవ స్వామి, డీఎస్పీ పురుషోత్తం, సీఐ రాజ్‌కుమార్ ఎస్సై ఎస్.సందీప్, ఎన్.నరేశ్, ఆలయ అధికారులు సునీల్, అశోక్ పాల్గొన్నారు.


