పకడ్బందీగా వినాయక నవరాత్రి ఉత్సవాలు | - | Sakshi
Sakshi News home page

పకడ్బందీగా వినాయక నవరాత్రి ఉత్సవాలు

Sep 4 2026 7:53 AM | Updated on Sep 4 2026 7:53 AM

● మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌

కరీంనగర్‌ కార్పొరేషన్‌: వినాయక నవరాత్రోత్సవాలు పకడ్బందీగా నిర్వహించాలని మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం నగరపాలకసంస్థ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణేశ్‌ విగ్రహాల శోభాయాత్ర జరిగే ప్రధాన రహదారుల్లో గుంతలు, దెబ్బతిన్న రోడ్లను గుర్తించి ప్యాచ్‌ వర్క్స్‌ పూర్తి చేయాలన్నారు. ముఖ్యంగా టవర్‌ సర్కిల్‌తో పాటు ప్రధాన జంక్షన్లలో లైటింగ్‌ ఏర్పాటు చేయాలన్నారు. నిమజ్జన సమయంలో రాత్రివేళ స్పష్టమైన వెలుతురు ఉండేలా అదనపు లైటింగ్‌ సౌకర్యాలు కల్పించాలన్నారు. భక్తుల కోసం సురక్షితమైన తాగునీటి సౌకర్యం కల్పించాలన్నారు. నిమజ్జనం ప్రాంతాల్లో రోడ్లు, పారిశుధ్యం, తాగునీరు, బారికేడింగ్‌, అత్యవసర సేవలకు ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలన్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా పోలీస్‌శాఖతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఒక్కో విభాగానికి, ఒక్కో అధికారికి స్పష్టమైన బాధ్యతలు కేటాయించాలని కమిషనర్‌కు సూచించారు. డిప్యూటీ మేయర్‌ యాదగిరి సునీల్‌ రావు పాల్గొన్నారు.

దశలవారీగా డివిజన్ల అభివృద్ధి

నగరపాలకసంస్థ పరిధిలోని అన్ని డివిజన్‌ల అభివృద్ధికి దశలవారీగా కృషి చేస్తున్నట్లు మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ తెలిపారు. 27వ డివిజన్‌లో సుడా నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. 30వ డివిజన్‌లో రూ.10 లక్షల నిధులతో చేపట్టిన పైప్‌లైన్‌ పనులకు భూమిపూజ చేశారు. కార్పొరేటర్లు బొట్ల శ్యామల కిరణ్‌, కల్లెపల్లి శారద పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement