కరీంనగర్‌అర్బన్: భద్రత, భరోసా లేని సీపీఎస్ రద్దు చేసి, ఓపీఎస్ పునరుద్ధరించాలని ఉద్యోగుల జేఏసీ జిల్లా చైర్మన్ దారం శ్రీనివాస్‌రెడ్డి, కన్వీనర్ మడిపల్లి కాళీచరణ్ గౌడ్ డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 1వ తేదీని పెన్షన్ విద్రోహ దినంగా పాటిస్తూ జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. భోజన విరామ సమయంలో కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. టీఎస్‌పీఎస్సీ రాష్ట్ర అధ్యక్షురాలు స్థితప్రజ్ఞ, టీఎన్జీ వో జిల్లా కార్యదర్శి సంగెం లక్ష్మణరావు, ఎడ్ల అరవింద్‌రెడ్డి, పెన్షనర్ల సంఘం నాయకులు కేశవరెడ్డి, ఎలదాసరి లింగయ్య, అంజయ్య పాల్గొన్నారు.


