ఎల్లారెడ్డిపేట( సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట ఎకై ్సజ్ సర్కిల్ పరిధిలో నాటు సారా స్థావరాలపై మంగళవారం మెరుపుదాడులు నిర్వహించారు. 16 లీటర్ల మద్యం, 100 కిలోల మహువ పువ్వులు, 500 లీటర్లకు పైగా బెల్లం పానకం, నాటసారా స్వాధీనం చేసుకున్నారు. ఎకై ్సజ్ సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాలు.. సర్కిల్ పరిధిలోని గోవిందరావుపేటతండా, ఖమ్మంపేటతండా, బక్కిరెడ్డితండా, లైన్‌తండా, నిమ్మపల్లితండా తదితర ప్రాంతాల్లో గుడుంబా తయారుచేసి విక్రయిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు హైదరాబాద్‌కు చెందిన టాస్క్‌ఫోర్స్ అధికారులు, స్థానిక ఎకై ్సజ్ సిబ్బంది, జిల్లా అధికారులు సంయుక్త దాడులు నిర్వహించారు. ఈ ఘటనలో మొత్తం 8 కేసులు నమోదు చేయగా, ఆరుగురిని అరెస్టు చేశారు. గుడుంబా, గంజాయి లాంటి మత్తుపదార్థాలు విక్రయించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు. నాటుసారా తయారీకి ముడి సరుకులు విక్రయించే వారిపై కూడా చర్యలు తప్పవన్నారు. దాడుల్లో ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ అధికారులు, స్థానిక సిబ్బంది పాల్గొన్నారు.


