పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి మండలం కాసులపల్లిలో యాప్‌లో చూపని 600 బస్తాల యూరియా ‘హాకా’ సెంటర్‌లో నిల్వఉన్నట్టు సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ అధికారులు జరిపిన దాడుల్లో అక్రమనిల్వలు బయటపడ్డాయి. ఈ నిల్వలను సీజ్‌చే సి వ్యవసాయాధికారులకు అప్పగించి కేసును రూరల్ పోలీసులకు అప్పగించినట్టు టాస్క్‌ఫోర్స్ ఎస్సై లక్ష్మణ్‌రావు, రమేశ్ తెలిపారు. డీలర్ ఆడెపు సంపత్ నుంచి నిల్వలను స్వాధీనం చేసుకుని వేరొక డీలరుకు అప్పగించామని ఏవో నాగార్జున తెలిపారు. అవి అక్రమ నిల్వలు కావని, యాప్‌ను మార్చే సమయంలో రైతులే నమోదు చేసుకున్నారని డీలర్ సంపత్ తెలిపారు. మంగళవారం కొంతమంది రైతులతో కలిసి కలెక్టర్‌ను కలిసి ఈ విషయం విన్నవించినట్టు వ్యవసాయాధికారులు వివరించారు. అయితే రైతులు తమవద్ద ఉన్న ఆధారాలతో వస్తే వారికి యూరియా నిల్వలను అప్పగించాలని, లేనిపక్షంలో అక్రమ నిల్వలుగా పరిగణించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశించారని ఏవో పేర్కొన్నారు.


