వేములవాడఅర్బన్: వేములవాడ రాజ న్నకు భక్తులు సమర్పించిన కోడెలు అ నారోగ్యంతో మృత్యువాత పడుతున్నా యి. తిప్పాపూర్‌లోని రాజన్న గోశాలలో వసతికి మించి 500 పైగా కోడెలు ఉన్నాయి. వర్షాకాలం కావడంతో దోమలు, ఈగలతో అపరిశుభ్రమైన వాతావరణం ఏర్పడి కోడెలు అనారోగ్యంతో నిత్యం రెండు నుంచి ఐదు మృతి చెందుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. మంగళవా రం ఐదు కోడెలు మృతిచెందగా వాటిని మూలవాగులో ఖననం చేశారు. స్వామి వారికి ప్రీతిపాత్రమైన కోడెలను భక్తులు సమర్పిస్తే పర్యవేక్షణ పూర్తిగా విఫలమై అవి మృత్యువాత పడుతున్నాయని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రతాప రామకృష్ణ ఆరోపించారు. కోడెల పట్ల నిర్లక్ష్యం చేస్తున్న అధికారుల తీరును నిరసిస్తూ త్వరలోనే రాష్ట్ర దేవాదాయశాఖ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.


