కరీంనగర్‌రూరల్: కరీంనగర్ మండలం మొగ్ధుంపూర్‌లో గురువారం గుండెపోటుతో బండి అంజయ్య(50)అనే రైతు పొలంలోనే మృతిచెందాడు. స్థానికుల కథనం మేరకు భార్య కొమురమ్మతో కలిసి అంజయ్య ఉదయం 11గంటలకు పొలం వద్దకు వెళ్లాడు. పనులు పూర్తి చేసుకుని మధ్యాహ్నం 3.30గంటలకు ఇంటికి బయల్దేరాడు. కొంతదూరం నడిచిన అంజయ్యకు ఆకస్మాత్తుగా గుండెపోటు రావడంతో పొలంలోనే పడిపోయాడు. భార్య కొమురమ్మ కేకలు వేయడంతో స్థానిక రైతులు వచ్చారు. చికిత్స నిమిత్తం కరీంనగర్‌లో ఆటోలో తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్యతోపాటు ముగ్గురు కూతుర్లు ఉన్నారు.
పారిశుధ్య కార్మికుడు..
రాయికల్: రాయికల్ బల్దియాలో వాటర్ లైన్‌మన్‌గా పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగి భీమయ్య (50) గుండెపోటుతో గురువారం మృతిచెందాడు. మున్సిపల్ చైర్మన్ కట్కం రవి అంత్యక్రియల నిమ్తితం రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేశారు. ఆయన వెంట కౌన్సిలర్లు గంగాధర్, రాకేశ్‌నాయక్, నాయకులు తురగ శ్రీధర్‌రెడ్డి, భూమేశ్, రాము, అనిల్, నాగరాజు పాల్గొన్నారు.


