అథ్లెటిక్స్‌ సందడి | - | Sakshi
Sakshi News home page

అథ్లెటిక్స్‌ సందడి

Jul 31 2026 1:57 AM | Updated on Jul 31 2026 1:57 AM

● ఆగస్టు 1న నగరంలో కిడ్స్‌ చాంపియన్‌షిప్స్‌తో పాటు అండర్‌– 18 జిల్లా ఎంపికలు

కిడ్స్‌ విభాగంలో

ఉదయం 8.30 గంటలకు క్రీడాకారులు రిపోర్ట్‌ చేయాలి. 9 గంటలకు పోటీలు ప్రారంభమవుతాయి. కిడ్స్‌ విభాగంలో అండర్‌–6, 8, 10, 12 బాలురు, బాలికలకు రన్నింగ్‌, స్టాండింగ్‌ లాంగ్‌జంప్‌, షాట్‌పుట్‌, బ్యాక్‌ త్రో పోటీలు నిర్వహిస్తారు. అండర్‌–14, 16, 18, 20 విభాగాలతో పాటు ఓపెన్‌ కేటగిరీలో బాలురు, బాలికలు, పురుషులు, మహిళలకు జావెలిన్‌ త్రో పోటీలు నిర్వహిస్తారు.

అండర్‌ 18 విభాగంలో

కిడ్స్‌, జావెలీన్‌ త్రో ఎంపికలతో పాటు అండర్‌–18 బాలురు, బాలికల జిల్లాస్థాయి అథ్లెటిక్స్‌ ఎంపికలు నిర్వహిస్తారు. ఇందులో 100, 200, 400, 1000 మీటర్ల రన్నింగ్‌, హర్డిల్స్‌, హైజంప్‌, లాంగ్‌జంప్‌, షాట్‌పుట్‌, డిస్కస్‌, జావెలిన్‌, రేస్‌వాక్‌, హెప్టాథ్లాన్‌ ఈవెంట్లలో పోటీలు నిర్వహించనున్నారు. జిల్లాస్థాయి ఎంపికల్లో పాల్గొనే ప్రతి క్రీడాకారుడు రూ.150 ప్రవేశ రుసుం చెల్లించాల్సి ఉంటుంది. ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను ఆగస్టు 7న హన్మకొండ జేఎన్‌ స్టేడియంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నారు. పోటీల్లో పాల్గొనేవారికి సర్టిఫికెట్లు, విజేతలకు మెడల్స్‌, మెరిట్‌ సర్టిఫికెట్లు అందజేయనున్నట్లు మహిపాల్‌ తెలిపారు.

కరీంనగర్‌స్పోర్ట్స్‌: పరుగులో వేగం, జావెలిన్‌లో గురి, క్రీడాస్ఫూర్తిలో విజయం... ఇవే ఒక అథ్లెటిక్‌ చాంపియన్‌ను తీర్చిదిద్దే ఆయుధాలు. గ్రామీణస్థాయి నుంచి జాతీయస్థాయి వరకు ప్రతిభను వెలికితీసి యువ అథ్లెట్లకు ఉన్నత వేదిక కల్పించాలనే లక్ష్యంతో కరీంనగర్‌ జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ ఆగస్టు 1న జాతీయ జావెలిన్‌ దినోత్సవం, కిడ్స్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్స్‌, అండర్‌ 18 జిల్లా ఎంపికలను ఒకే వేదికపై నిర్వహిస్తోంది. ఆగస్టు 1 కరీంనగర్‌లోని రీజినల్‌ స్పోర్ట్స్‌ స్కూల్‌ మైదానంలో 5వ జాతీయ జావెలిన్‌ దినోత్సవం, 1వ కిడ్స్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్స్‌తో పాటు 12వ రాష్ట్ర యూత్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్స్‌ అండర్‌ 18 జిల్లా జట్టు ఎంపికలు నిర్వహించనున్నట్లు జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ అధ్యక్ష కార్యదర్శులు నందెల్లి మహిపాల్‌, సుమన్‌ కల్యాణ్‌ తెలిపారు.

ప్రవేశ రుసుం జిల్లా సంఘం భరిస్తుంది

జిల్లాస్థాయి ఎంపికల్లో ప్రతిభ కనబర్చి ఆగస్టు 7న హన్మకొండ జేఎన్‌ స్టేడియంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యే క్రీడాకారుల రూ.300 రాష్ట్ర ప్రవేశ రుసుంను జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషనే భరిస్తుంది. చిన్నారుల్లో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు కిడ్స్‌ అథ్లెటిక్స్‌, జావెలిన్‌ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నాం. జిల్లాలోని ప్రతి యువ క్రీడాకారుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

– నందెల్లి మహిపాల్‌,

జిల్లా అథ్లెటిక్‌ సంఘం అధ్యక్షుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement