ప్రజావాణి ఆధునీకరించినా అందని పరిష్కారం మే 4 నుంచి సరికొత్త రూపం 30 రోజులు దాటినా పట్టని తీరు వెబ్‌సైట్‌లో కానరాని యాక్షన్ టేకెన్ రిపోర్ట్
ఈ ఏడాది మే నుంచి జూలై 2026 వరకు కరీంనగర్ జిల్లా యంత్రాంగానికి 1,608 ఫిర్యాదులు రాగా.. అందులో 30 రోజులు దాటినా పరిష్కారానికి నోచుకోని దరఖాస్తులు 326 ఉన్నాయి.
జగిత్యాల జిల్లాలో 307 ఫిర్యాదులు రాగా.. అందులో 69 దరఖాస్తులు 30 రోజులు దాటినా పరిష్కారానికి నోచుకోలేదు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొత్తం 2009 ఫిర్యాదులు రాగా.. సమస్యలు ఎన్ని పరిష్కారం కాలేదో వెల్లడించలేదు.
పెద్దపల్లి జిల్లాలో మొత్తం 678 ఫిర్యాదులు రాగా.. అందులో 257 ఫిర్యాదులు 30 రోజులు దాటినా పరిష్కారానికి నోచుకోలేదు.
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ప్రజావాణిలో స్వీకరించే ప్రతీ దరఖాస్తును గతంలో ఆన్‌లైన్‌లో నమోదు చేసిన అధికారులు ఆ తరువాత పరిష్కారంపై మాత్రం చొరవ చూపేవారు కాదు. 90శాతం వరకు సమస్యలకు సరైన పరిష్కారం చూపకుండానే మూసివేసినట్లు ప్రకటించేవారు. దరఖాస్తు లైవ్‌లో ఉందా? లేక క్లోజ్ చేశారా? అనే కనీస సమాచారం కూడా ఉండేది కాదు. ఈ క్రమంలో ప్రజావాణిలో ప్రజల సమస్యలు పరిష్కరించి.. అధికారుల్లో జవాబుదారీతనం పెంచేలా ప్రభుత్వం నడుంబిగించింది. ప్రజావాణి కోసం కొత్త వెబ్‌సైట్‌తోపాటు గైడ్‌లైన్ విడుదల చేసింది. ఈ మేరకు జీవో ఎంఎస్ నంబర్ 3ని 2026 ఏప్రిల్ 30న విడుదల చేసింది. ఈ జీవో ప్రకారం ప్రజావాణికి వచ్చే దరఖాస్తుదారులు పదేపదే కార్యాలయాల చుట్టూ తిరగకుండా వారి వద్దకే నేరుగా సేవలు అందేలా కొత్త సొబగులు అద్దింది. ప్రతీ దరఖాస్తును 30 రోజుల్లో కచ్చితంగా పరిష్కరించాలని, అనంతరం యాక్షన్ టేకెన్ రిపోర్ట్ (ఏటీఆర్)ను ప్రజవాణి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని నిర్ణయించింది. కానీ.. కొత్త ప్రజావాణి ఆరంభమై రెండు నెలలు గడుస్తున్నా.. అమలులో జిల్లాయంత్రాంగం నిర్లక్ష్యం వహిస్తూ ప్రభుత్వ ప్లాగ్‌షిప్ ప్రోగ్రామ్‌ను లక్ష్యానికి దూరంగా ఉంచుతున్నాయి.
కొత్త జీవో ఏం చెబుతోంది..?
ఉమ్మడి జిల్లాలో ఇలా..


