ప్రతీ డివిజన్‌లో వసతులు | - | Sakshi
Sakshi News home page

ప్రతీ డివిజన్‌లో వసతులు

Jul 6 2026 7:00 AM | Updated on Jul 6 2026 7:00 AM

కరీంనగర్‌ కార్పొరేషన్‌: నగరంలోని అన్ని డివిజన్లలో మౌలిక వసతులు కల్పించడం లక్ష్యంగా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ తెలిపారు. ఆదివారం నగరపాలక సంస్థ 2వ డివిజన్‌ తీగలగుట్టపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల సమీపంలోని అపార్ట్‌మెంట్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన ఓపెన్‌ జిమ్‌ను ప్రారంభించారు. సరస్వతినగర్‌ రోడ్‌ నంబర్‌ 5లో రూ.10లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. కార్పొరేటర్‌ భాస్కర్‌నాయక్‌, అపార్ట్‌మెంట్‌ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement