● మూడున్నర తులాల బంగారం..
● 50 తులాల వెండి వస్తువులు చోరీ
జగిత్యాలరూరల్: బీర్‌పూర్ మండల కేంద్రానికి చెందిన మదిరె గంగయ్య ఇంటి తాళాలు పగులగొట్టిన గుర్తు తెలియని దొంగలు చోరీకి పాల్పడ్డారు. గంగయ్య తన ఇంటికి తాళం వేసి సారంగాపూర్ మండలం లక్ష్మిదేవిపల్లి గ్రామంలో తన కూతురు గృహ ప్రవేశానికి వెళ్లాడు. వచ్చి చూసే సరికి తాళాలు పగులగొట్టి ఉన్నాయి. లోపలికి వెళ్లి చూడగా మూడున్నర తులాల బంగారం, 50తులాల వెండి ఆభరణాలు కనిపించలేదు. బాధితుడి ఫిర్యాదు మేరకు జగిత్యాల రూరల్ సీఐ సుధాకర్, ఎస్సై రాజు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోలీసు జాగిలాలతో గాలింపు చర్యలు చేపట్టారు.


