ఆదివారంపేటలో జేసీబీ దగ్ధం | - | Sakshi
Sakshi News home page

ఆదివారంపేటలో జేసీబీ దగ్ధం

Jul 6 2026 7:00 AM | Updated on Jul 6 2026 7:00 AM

రామగిరి: పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం ఆదివారంపేట గ్రామంలో ఆదివారం వేకువజామున జేసీబీ దగ్ధమైంది. ఏలువాక వెంకటేశ్‌కు చెందిన జేసీబీ కాలిపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై శ్రీనివాస్‌ తన సిబ్బందితో సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. అనేకఏళ్ల కష్టార్జితంతో కొనుగోలు చేసిన జేసీబీ అగ్నికి ఆహుతి కావడంతో వెంకటేశ్‌ కన్నీటి పర్యంతమయ్యాడు. ప్రమాదవశాత్తు షార్ట్‌ సర్క్యూట్‌తో దగ్ధమైందా? లేక కావాలనే ఎవరైనా నిప్పంటించారా? అనే కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఎస్సై తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement