కరీంనగర్‌రూరల్: బొమ్మకల్ బైపాస్‌లోని ఫ్‌లైఓవర్‌బ్రిడ్జి సమీపంలో శనివారం అర్ధరాత్రి బూడిదట్యాంకర్ బోల్తాపడటంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పెద్దపల్లి నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా బైపాస్‌లో ట్యాంకర్ అదుపు తప్పడంతో క్యాబిన్ నుంచి ట్యాంకర్ రోడ్డుపై పడి లారీని ఢీకొట్టింది. ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. రోడ్డుపై ట్యాంకర్ పడడంతో వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న సీఐ నిరంజన్‌రెడ్డి అక్కడికి చేరుకుని పరిశీలించారు. ట్యాంకర్‌ను తొలగించి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు.


